ఇష్టమొచ్చినట్లు హామీలు ఇవ్వకండి.. మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రాల బడ్జె్ట్‌ను పరిగణలోకి తీసుకోకుండా హామీలు ప్రకటించొద్దని సూచనలు చేశారు. ఇలా చేస్తే రాష్ట్రం దివాల తీసే పరిస్థితులు ఉంటాయని హెచ్చరించారు.

New Update
Kharge

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రాల బడ్జెట్‌ను పరిగణలోకి తీసుకోకుండా హామీలు ప్రకటించొద్దని సూచనలు చేశారు. మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల కాంగ్రెస్ చీఫ్‌లకు సూచించారు. రాష్ట్ర బడ్జెట్‌ ఆధారంగానే గ్యారంటీలు ప్రకటించాలని పేర్కొన్నారు. కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు సేవలు అందించే శక్తి స్కీమ్‌ను మళ్లీ సమీక్షిస్తామని డిప్యూటీ సీఎం డేకే శివకుమార్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ విషయం ఖర్గే దృష్టికి వెళ్లింది. అయితే ఈ పథకాన్ని మళ్లీ సమీక్షించే ఆలోచన ప్రభుత్వానికి లేదని.. సీఎం సిద్దరామయ్యతో పాటు రవాణాశాఖ మంత్రి రామలింగా రెడ్డి స్పష్టం చేశారు. 

Also Read: ఈసీకి స్వతంత్రత లేదు–‌‌కాంగ్రెస్ లేఖ

ఆర్థిక ఇబ్బందులు వస్తాయి

ఈ నేపథ్యంలోనే మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. హామీలు ప్రకటించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. ప్రణాళికలు లేని హామీలివ్వడం ద్వారా భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయని అన్నారు. ఇవి రాబోయే తరాలపై ప్రతికూలంగా ప్రభావం చూపూతాయన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రజల్లో నమ్మకం కూడా పోతుందని.. చివరికి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు.  

''మహారాష్ట్రలో ఏడెనిమిది గ్యారెంటీల హామీలు ఇవ్వొద్దని కాంగ్రెస్ నాయకులు సూచించాను. మీ బడ్జెట్‌తో సరిపోయే హామీలే ఇవ్వండి. రాష్ట్ర బడ్జెట్‌ను పరిగణలోకి తీసుకోకుండా హామీలు ఇస్తే రాష్ట్రం దివాల తీసే పరిస్థితులు ఏర్పడుతాయి. ప్రణాళిక లేని విధానం ఆర్థిక ఇబ్బందులకు దారి తీస్తుంది. చివరికి రోడ్లు వేసేందుకు కూడా డబ్బులు ఉండని పరిస్థితి రావొచ్చు. దీనివల్ల రాబోయే పదేళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను ఎదుర్కొవాల్సి ఉంటుందని'' ఖర్గే అన్నారు. 

Also Read: సమీపిస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. ఎంతమంది బరిలో ఉన్నారంటే

ఇదిలాఉండగా కర్ణాటకలో మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ అమల్లో ఉండగా.. పలువురు మహిళలు టికెట్లు కొని బస్సుల్లో ప్రయాణించేందుకు ముందుకొస్తున్నారని డిప్యూటీ సీఎం డేకే శివ అన్నారు. ఈ స్కీమ్‌పై మరోసారి సమీక్ష చేస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్ పథకం అమలు చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది జూన్ 11న శక్తి పథకాన్ని ప్రారంభించింది. అయితే ఈనెల 18 నాటికి 311 కోట్ల ఉచిత ప్రయాణాలు జరగగా.. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.7,507 కోట్లను ఖర్చు చేసింది.   

Advertisment
Advertisment
తాజా కథనాలు