Fashion: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ కన్నుమూత

ఫేమస్ ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ ఈరోజు కన్నుమూశారు.  దీర్ఘకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం రోహిత్ బాల వయసు 63 ఏళ్ళు. 

New Update
12

Rohith Bal: 

భారతీయ ఫ్యాషన్ రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ డిజైనర్ రోహిత్ బాల్ ఇక లేరు. 63 ఏళ్ల వయసులో ఆయన చనిపోయారు. దీర్ఘకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. రోహిత్ బాల్ మృతికి ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంతాపం తెలిపింది. పురుషులు, మహిళలకు ఆయన అందించిన డిజైన్లు బాగా ప్రసిద్ధి చెందాయి. 1986లో ఆర్చిడ్ ఓవర్సీ ప్రైవేట్ లిమిటెడ్‌ని స్థాపించి తన వృత్తిని ప్రారంభించారు రోహిత్ బాల్.
 
మే 8, 1961లో జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో కాశ్మీరీ పండిట్ కుటుంబంలో రోహిత్ బాల్ జన్మించారు. శ్రీనగర్‌లోని వుడ్‌ల్యాండ్స్ హౌస్ స్కూల్, బర్న్ హాల్ స్కూల్‌లో ఆయన చదువుకున్నారు.  1970లో ఇస్లామిస్ట్ తిరుగుబాటు కారణంగా ఈయన కుటుంబం ఢిల్లీకి షిఫ్ట్ అయింది. తరువాత మథుర రోడ్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో రోహిత్ విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందారు. అనంతరం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ విద్యను నేర్చుకున్నారు. 1986లో సోదరుడు రాజీవ్ బాల్‌తో కలిసి ఢిల్లీలో ఆర్చిడ్ ఓవర్సీ ప్రైవేటు లిమిటెడ్ ప్రారంభించారు.

భారతదేశంలో నక్షత్ర డిజైనర్ల లిస్ట్‌లో ఎప్పుడూ రోహిత్ బాల్ ఉంటుంది. 25 ఏళ్ళకు పైగా ఈయన ఫ్యాషన్ రంగంలో ఉన్నారు.  ఖరీదైన దుస్తులను రూపొందించడంలో రోహిల్ ప్రసిద్ధుడు.  చక్కటి పనితో సముచిత స్థానాన్ని బాల్ తన కంటూ ఏర్పరచుకున్నారు. ఫ్యాషన్ ఈవెంట్‌లో ‘డిజైనర్ ఆఫ్ ది ఇయర్’ అనే బిరుదును కూడా రోహిత్ బాల్ అందుకున్నారు.

Also Read: Movies: కూతురు పేరును ప్రకటించిన దీపికా-రణవీర్..అర్ధం ఇదే..

 

 

 

 

 

 

 

 

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు