/rtv/media/media_files/2025/09/16/income-tax-returns-2025-09-16-07-00-39.jpg)
Income Tax Returns
Income Tax Returns : ఇప్పటివరకు ఐటీఆర్ (Income Tax Returns) దాఖలు చేయనివారికి గుడ్ న్యూస్. దాఖలు గడువును పొడిగిస్తూ ఇన్‌కంటాక్స్ డిపార్ట్ మెంట్ నిర్ణయం తీసుకుంది. అయితే అది కేవలం ఈ ఒక్కరోజు (సెప్టెంబర్ 16 వరకు) మాత్రమే అవకాశం ఉంది. మొదట సోమవారం నాటికే అవకాశం ఇచ్చినప్పటికీ ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈ మేరకు సోమవారం రాత్రి ఆదాయపు పన్ను విభాగం మరొక రోజు పొడిగిస్తూ ప్రకటన చేసింది. పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు ఏర్పడడం మూలంగా చాలామంది తమ ఐటీ రిటర్న్ చేయలేకపోయారని యూజర్ల ఫిర్యాదు చేయడంతో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు విభాగం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదాయపు పన్ను విభాగం ‘ఎక్స్’లో ఈ మేరకు పోస్టు చేసింది.
Also Read: ఆఫీసులో వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య.. కంపెనీకి రూ.90 కోట్ల జరిమానా
2025-26 ఏడాదికి గాను ఐటీఆర్ దాఖలు చేసేందుకు జులై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు అంటే నిన్నటి వరకు డెడ్‌లైన్ విధించింది. ఆ మేరకు సోమవారంతో ఆ గడువు పూర్తయింది. కాగా ఆశించిన మేరకు సెప్టెంబర్ 15 వరకు రికార్డు స్థాయిలో 7.3 కోట్లకు పైనే ఐటీఆర్ ఫైలింగ్‌లు జరిగినట్లు ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. గతేడాది జరిగిన ఐటీఆర్ ఫైలింగ్‌లు 7.27 కోట్లు కాగా ఈసారి దాన్ని అధిగమించినట్లు తెలిపింది. కాగా పెంచిన గడువు బట్టి మంగళవారం అర్ధరాత్రి దాటాక 2.30 గంటల వరకు ఈ-ఫైలింగ్ పోర్టల్ మెయింటనెన్స్ మోడ్‌లో ఉంటుంది. మార్పు చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఉందని ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.
Also read: ఈ అనుమానంతోనే లండన్‌లో నిరసనలు.. బ్రిటన్‌ని కదిలించిన ముగ్గురు పిల్లల చావు
సోమవారం సాయంత్రం వెబ్‌సైట్‌లో ఈ ఫైలింగ్‌కు సంబంధించి తలెత్తిన సమస్యలపై యూజర్ల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. దీంతో ఆదాయపు పన్ను విభాగం స్పందించింది. బ్రౌజర్ సమస్యలు పరిష్కరించేందుకు పలు సూచనలు జారీ చేసింది. పన్ను చెల్లింపుదారుల సమస్యలను పరిష్కరించేందుకు 24x7 పనిచేసే ఒక హెల్ప్ డెస్క్‌ను కూడా ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఫోన్ కాల్స్, లైవ్ చాట్స్, వెబ్‌ఎక్స్ సెషన్స్, ఎక్స్ ద్వారా యూజర్లకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడానికి సంబంధిత అధికారులు అందుబాటులో ఉంటారని వెల్లడించింది.