Telangana: బీఆర్ఎస్పై బీజేపీ పంజా.. రేపు హైదరాబాద్లో ఐటీ దాడులు జరిగే ఛాన్స్..!
తెలంగాణకు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే.. యుద్ధం వాతావరణం నెలకొంది. అప్పుడే ప్రధాన పార్టీలు తమ అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. వాస్తవంగా చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) రాకతో రాష్ట్రంలో పొలిటికల్ సీన్ మొత్తం మారిపోయింది. రెండు సభల్లో ప్రధాని ప్రసంగం ఒక ఎత్తైతే.. గురువారం జరుగబోయే సీన్ మరో ఎత్తు ఉండబోతుందని తెలుస్తోంది. అవును, బీఆర్ఎస్ టార్గెట్గా ఐటీ దాడులు జరిగే అవకాశం కనిపిస్తోంది. గురువారం ఉదయం నుంచే హైదరాబాద్లో బీఆర్ఎస్ మద్దతుదారులపై ఐటీ దాడులు జరిగే అవకాశం కనిపిస్తోంది.