TG Farmer Protest : తన భూమి తనకు ఇప్పించమని...చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ..

అనేక ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా..తన భూమి సమస్యను పరిష్కరించకపోవడంతో కడుపు మండిన యువరైతు వినూత్న నిరసన చేపట్టాడు. అధికారులకు వందకు పైగా వినతి పత్రాలు ఇచ్చినా స్పందించకపోవడంతో, ఏకంగా తన భూమిలోని చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ నిరసన వ్యక్తం చేశాడు.

New Update
TG Farmer Protest

TG Farmer Protest

TG Farmer Protest :  అనేక ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. తన భూమి సమస్యను పరిష్కరించకపోవడంతో కడుపు మండిన యువరైతు వినూత్న నిరసన చేపట్టాడు. అధికారులకు వందకు పైగా వినతి పత్రాలు సమర్పించినా అధికారులు స్పందించకపోవడంతో, ఏకంగా తన భూమిలోని చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ నిరసన వ్యక్తం చేశాడు. ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాసి తన 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేశాడు. చిన్నప్పుడు తమ పొలంలోని ఏ చెట్టు కిందయితే ఆడుకున్నాడో.. ఇప్పుడు అదే వేపచెట్టుకు తలకిందులుగా వేలాడుతూ.. చేతిలో భూమి పత్రాలతో ప్రభుత్వాన్ని వేడుకుంటున్న తీరు అందరినీ కలిచివేసింది. ఇది కేవలం నిరసన కాదు, తన తండ్రి నుంచి వచ్చిన వారసత్వ ఆస్తిని తనకు ఇప్పించాలని కొడుకు చేస్తున్న ఆందోళన. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: వేసవిలో తలనొప్పి తగ్గించే ఇంటి చిట్కాలు

బాధితుడు వుల్లింతల జీవన్‌ తెలిపిన వివరాల ప్రకారం తనకు తన తండ్రి నుంచి వారసత్వంగా కొంత వ్యవసాయ భూమి సంక్రమించింది. ఈ భూమిని జీవన్ తండ్రి సుమారు 20 ఏళ్ల క్రితం మరొక వ్యక్తి నుంచి చట్టబద్ధంగా కొనుగోలు చేసి, అప్పటి నుంచి సాగు చేసుకుంటున్నారు. ఈ భూమికి సంబంధించి కొత్త, పాత పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్, పహానీ పత్రాలు వంటి అన్ని రికార్డులు తమ వద్ద ఉన్నాయని జీవన్ చెబుతున్నారు. అయితే, గతంలో జరిగిన రెవెన్యూ రికార్డుల నమోదు ప్రక్రియలో పొరపాట్ల కారణంగా, ఈ భూమి సర్వే నంబర్ సీలింగ్ పరిధిలోని భూమి సర్వే నంబర్‌లో నమోదైందని జీవన్ వాపోతున్నారు. దీని కారణంగా ప్రస్తుతం అధికారులు ఈ భూమిని నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: KCR: అధికారం పోగానే నక్సలైట్లు గుర్తుకొచ్చారా.. కేసీఆర్‌పై రఘునందన్ సంచలన కామెంట్స్!

అసలు సీలింగ్ హోల్డర్ రెండు వేర్వేరు సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్ చేయించి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని, దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని ఆయన తెలిపారు. సమస్య పరిష్కారం కోసం ఏడాది కాలంగా తాను ఎమ్మార్వో, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నానని, వందకు పైగా వినతి పత్రాలు సమర్పించినా ఎటువంటి పురోగతి లేదని జీవన్ ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరాల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా.. కలెక్టర్ గుమ్మం తట్టినా.. ఎమ్మార్వో కాళ్లు పట్టుకున్నా.. ఆర్డీవోను వేడుకున్నా.. ఎక్కడా తనకు న్యాయం లభించలేదన్నాడు. చివరికి ముఖ్యమంత్రి కార్యాలయానికి సైతం వందకు పైగా లేఖలు రాసినా..తన సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్వక్తం చేశాడు.  ఈ క్రమంలోనే, తన గోడును అధికారులకు, ప్రభుత్వానికి తెలియజేసేందుకు వినూత్న నిరసనకు దిగినట్లు తెలిపారు. తన నిరసనకు తను చిన్నపుడు ఆడుకున్న చెట్టునే వేదిక చేసుకున్నానని వెల్లడించాడు.తన భూమిలోని వేప చెట్టుకు భూమి పత్రాలను కట్టి, అదే చెట్టుకు తాను తలకిందులుగా వేలాడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలను వీడియో తీసి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

ఇది కూడా చదవండి: BIG BREAKING: జానారెడ్డి ఇంటికి సీఎం రేవంత్.. కారణం అదేనా!?
 
"ఈ చెట్టు, నా బాల్యం, నా కలలు అన్నింటికీ చిహ్నం. ఇదే చెట్టు కింద పెరిగాను. చెట్టు కింద నిద్రపోయిన జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ అదే నేలపై ఇప్పుడు నేను నిలబడలేకపోతున్నాను. ఎందుకంటే రెవెన్యూ శాఖ ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం చేసిన పరిపాలనా తప్పిదం వల్ల ఈనాడు మా భూమి నిషేధిత జాబితాలో చేరిపోయింది. ఇది నా ఆత్మ తలకిందులుగా మారిన పరిస్థితిని మీకు చూపించే ప్రయత్నం. నమ్మకానికి చేసిన వంద అభ్యర్థనలు, వేలాడుతున్న ఆ కాగితాలు.. ఒక సంవత్సరం పైగా అధికార కార్యాలయాల చుట్టూ తిరుగుతూ మా గుండెల్లో వెలిసిన బాధ. అవి నా నిరుద్దేశమైన ఆవేదన కాదు, నిరసన కాదు ఇది. ఒక మనిషి హృదయం విరిగి, విచ్చిన్నం అయి చివరి ఆశగా చేపట్టిన విన్నప పోరాటం ఇది." అంటూ జీవన్ రాసిన లేఖలోని ప్రతి అక్షరం అందరి హృదయాలను ద్రవింపజేస్తోంది. 

ఇది కూడా చదవండి: రాత్రిపూట కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే గుండెపోటుకు సంకేతం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు