/rtv/media/media_files/2025/03/29/1JulEyWQ6TuRZqiTKh3M.jpg)
gun fire
తెలంగాణలో గన్ కల్చర్ పెరుగుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న కాల్పుల ఘటనలో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. అక్రమ ఆయుధాలతో ప్రత్యర్థులపై దాడి చేస్తున్న ఘటనలు తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని మలక్‌పేట, మెదక్ జిల్లాలో జరిగిన కాల్పుల ఘటనలు భయాందోళనను కల్గిస్తున్నాయి.
Also Read : భట్టికి బిగ్ షాక్..రూ.25 కోట్ల పరువు నష్టం దావా? బీజేపీ చీఫ్ నోటీసులు
హైదరాబాద్ అర్థరాత్రి తుపాకుల మోతతో దద్దరిల్లింది. మలక్‌పేట శాలివాహన నగర్ పార్కులో వాకింగ్ చేస్తున్న సీపీఐ రాష్ట్ర నాయకుడు చందు నాయక్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కారులో వచ్చిన దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో చందునాయక్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆర్థిక లావాదేవీలు, భూవివాదాల కారణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో రాజేశ్, సుధాకర్‌తో పాటు మరో ఇద్దరు నిందితులు పోలీసులకు లొంగిపోయారు.
Also Read: రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు
Telangana Gun Culture
మరోవైపు మెదక్ జిల్లాలో కాంగ్రెస్ యువనేత మారెల్లి అనిల్ పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అనిల్ కుడి భుజం నుంచి రెండు బుల్లెట్లు దూసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలంలో నాలుగు బుల్లెట్‌లు స్వాధీనం చేసుకున్నారు. మెదక్ -హైదరాబాద్ రహదారి పక్కన కారులో అనిల్ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
Also Read: ISS నుంచి శుభాంశు శుక్లా తెస్తున్న 263కేజీల నిధి.. ఏంటో తెలిస్తే షాక్!
ఇక జులై 13న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంలోనూ కాల్పుల ఘటన కలకలం రేపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. మల్లన్న ఆఫీస్‌లో ఫర్నీచర్, అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో మల్లన్న గన్‌మెన్ గాల్లో ఆరు రౌండ్ల కాల్పులు జరిపాడు. కానీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
అటు గతంలో హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌లో బీదర్ దొంగల ముఠా కాల్పుల ఘటన కలకలం రేపింది. బీదర్‌లో ATM దోపిడీ చేసిన ఇద్దరు నిందితులు.. ఆ డబ్బుతో హైదరాబాద్‌కు వచ్చారు. పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేయగా.. వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. అప్పటి నుంచి రాష్ట్రంలో తుపాకీ మోత విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది.
Also Read: తుంగతుర్తిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే కిశోర్ తో పాటు బీఆర్ఎస్ కీలక నేతల అరెస్ట్!
ఇప్పటి వరకు బీహార్, యూపీలాంటి ప్రాంతాలకే పరిమితమైన గన్ కల్చర్ తెలంగాణకు చేరింది. వరుస కాల్పుల ఘటనలు ప్రజల్లో భయాందోళనలు కల్గిస్తున్నాయి. కాల్పుల ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకోవాలని జనం కోరుతున్నారు. అక్రమ ఆయుధాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ వినిపిస్తోంది. రాష్ట్రంలో అసాంఘిక శక్తులు వినియోగిస్తున్న ఆయుధాల్లో 80 శాతం వరకూ రాజధానిలోనే ఉన్నాయని తెలుస్తోంది.
Gun Fire Incident | gun-fire | gun fire in hyderabad | gun culture telugu news | gun control debate