Ration card: పేదలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులపై కీలక అప్డేట్!
పేదలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మే 7నుంచి కొత్త రేషన్కార్డులకోసం దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. నెలరోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని, గ్రామ, వార్డు సచివాలయాల్లో తమ వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు.