RRR 2: ఇటీవలే లండన్ లో లైవ్ మ్యూజిక్ ఆర్కెస్ట్రాతో RRR మూవీ స్పెషల్ స్క్రీనింగ్ నిర్వహించారు. ఈ ప్రదర్శనకు డైరెక్టర్ రాజమౌళి, రామ్ చరణ్, తారక్, దంపతులు హాజరయ్యారు. అయితే ఈవెంట్ ముగింపు సమయంలో రామ్ చరణ్, తారక్, జక్కన్నకు సంబంధించి ఉపాసన సరదాగా తీసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో చరణ్, తారక్ రాజమౌళిని ఆటపట్టిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఒకరు RRR 2 చేస్తారా అని అడగ్గా.. జక్కన్న సరదాగా 'యస్' అని చెప్పారు. దీంతో పార్ట్ 2 పై రాజమౌళి హింట్ ఇచ్చేశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. లండన్ ఆల్బర్ట్ హాల్ లో లైవ్ కాన్సర్ట్ ప్రదర్శించిన తొలి విదేశీ చిత్రంగా బాహుబలి 2 రికార్డు క్రియేట్ చేయగా..ఇప్పుడు RRR రెండవ సినిమాగా నిలిచింది.
latest-news | cinema-news