/rtv/media/media_files/2025/01/20/w5itTaxbmgqQPuT0V55v.jpg)
Governor Awards for Excellence 2024 Photograph: (Governor Awards for Excellence 2024)
తెలంగాణ గవర్నర్ కార్యాలయం గవర్నర్ ప్రతిభా పురస్కారాలు-2024 అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డులకు 8 మంది ఎంపికైనట్లు తెలిపింది. దీనికి సంబంధించిన జాబితాను వెల్లడించింది. వివిధ రంగాల్లో సేవలందించిన సంస్థలు, వ్యక్తులకు ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ నెల 26న ఎంపికైనా వారికి ఈ అవార్డులను ఇవ్వనున్నారు.
ఇది కూడా చూడండి: Akkineni Akhil: అఖిల్ పెళ్ళి డేట్ ఫిక్స్.. ఆరోజు నుంచి ఘనంగా పెళ్లి వేడుకలు
Former Union Home Secretary and Padma Bhushan awardee K Padmanabhaiah IAS announces the list of awardees for the Governor's Awards for Excellence - 2024. @NewIndianXpress @XpressHyderabad @Kalyan_TNIE @santwana99 @balaexpressTNIE pic.twitter.com/NarLlnEkqr
— Sri Loganathan Velmurugan (@sriloganathan6) January 20, 2025
అవార్డుల జాబితాను..
అవార్డులకు ఎంపికైనా వారి పేర్ల జాబితాను విడుదల చేశారు. దుశర్ల సత్యనారాయణ, అరికపూడి రఘు, పారా ఒలింపిక్ విజేత జీవాంజి దీప్తి, ప్రొఫెసర్ ఎం.పాండురంగారావు, పి.బి.కృష్ణభారతి, ధ్రువాంశు ఆర్గనైజేషన్, ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి, ఆదిత్య మెహతా ఫౌండేషన్, సంస్కృతి ఫౌండేషన్ ఎంపికయ్యారు.
ఇది కూడా చూడండి: Saif Ali Khan: సైఫ్‌పై దాడి జరిగేటప్పుడు నలుగురు మగ పనిమనుషులు అక్కడే.. వెలుగులోకి సంచలన నిజాలు
నాలుగు రంగాలకు చెందిన వారికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతీ ఏడాది పురస్కారాలు ఇవ్వాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిర్ణయించారు. పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు, సాంస్కృతిక విభాగాల్లో ఐదేళ్లు నుంచి ఉత్తమ సేవలు అందిస్తున్న వారికి ఈ ప్రతిభా పురస్కారాలు ఇవ్వనున్నారు. అవార్డు కింద రూ.2 లక్షలు, జ్ఞాపిక కూడా ఇవ్వనున్నారు.
ఇది కూడా చూడండి: Health: చిన్న బెల్లం ముక్కతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో ..కానీ ఏ సమయంలో తినాలో తెలుసా!