TG News: సాగరతీరాన సెయిలింగ్‌ ఛాంపియన్‌షిప్‌

హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌లో తెలంగాణ రాష్ట్రం సెయిలింగ్‌ ఛాంపియన్‌షిప్‌ కొనసాగుతున్నాయి . ఈ పోటీల్లో ఆరు విభాగాల్లో 15 జిల్లాల నుంచి 131 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. రెండోరోజు పోటీల్లో టాప్‌సీడ్‌ సెయిలర్లు గోవర్ధన్‌, శ్రవణ్‌ సత్తా చాటుతున్నారు.

New Update
sailing championship begins

sailing championship begins Photograph

హైదరాబాద్‌ నగరంలోని హుస్సేన్‌సాగర్‌ తీరం సందడిగా మారింది. సాగర్‌ వేదికగా తెలంగాణ రాష్ట్ర సెయిలింగ్‌ ఛాంపియన్‌షిప్‌ 8వ ఎడిషన్‌ ప్రారంభమైంది. ఈ పోటీల్లో ఆరు విభాగాల్లో 15 జిల్లాల నుంచి 131 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. తొలి రోజు హుస్సేన్‌సాగర్‌లో సెయిలర్లు రంగు రంగుల బోట్లతో ప్రాక్టీస్‌ చేసి అలరించారు.  తెలంగాణ సెయిలింగ్‌ సంఘం, యాచ్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీ భారత్‌లోనే అతిపెద్ద ఛాంపియన్‌ షిప్‌లో ఒకటిగా నిలిచింది.

Also Read :  పుష్ప స్టైల్లో నితీశ్ రెడ్డి.. వీడియో చూస్తే గూస్‌బంప్స్ రావాల్సిందే!

Also Read :  దానిమ్మ తొక్కతో కూడా బరువు తగ్గొచ్చు..తెలుసా?

సత్తా చాటుతున్న శ్రవణ్‌:

ఈసారి 29 ఈఆర్‌ స్కిఫ్, 420 డబుల్‌ హ్యాండర్స్‌ విభాగాలను యాడ్‌ చేయడంతో అన్ని కేటగిరీల్లో  రికార్డు ఎంట్రీలు నమోదయ్యాయని నిర్వాహకులు అంటున్నారు. 2026లో చైనాలో నిర్వహించే ఆసియా గేమ్స్‌, లాస్‌ ఏంజెల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌ మీద దృష్టి సారించామని పేర్కొన్నారు. మన రాష్ట్రం పదేళ్లలో 60 మందికిపైగా జాతీయ చాంపియన్లు, 275 పతకాలతో ముందంజలో ఉంది. రెండోరోజు జరిగిన పోటీల్లో టాప్‌సీడ్‌ సెయిలర్లు గోవర్ధన్‌, శ్రవణ్‌ సత్తా చాటుతున్నారు. 

సబ్‌జూనియర్‌ ఓవరాల్‌ అప్టిమిస్టిక్‌ కేటగిరీలో హైదరాబాద్‌కు చెందిన గోవర్ధన్‌ స్థిరమైన ప్రదర్శనతో ఆధిక్యం కనబరిచాడు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకొచ్చి పసిడి పతకానికి చేరువయ్యాడు. ఇదే రేసులో దీక్షిత రెండు రేసుల్లో నిరాశపరిచి రెండో స్థానంలో కొనసాగుతోంది. దీక్షిత సోదరి లాహిరి సబ్‌జూనియర్‌ ఓవరాల్‌ అప్టిమిస్టిక్‌లో మూడో స్థానానికి పడిపోయింది. మరోవైపు జూనియర్‌ లేజర్‌ ఫ్లీట్‌లో నల్గొండకు చెందిన శ్రవణ్‌ కత్రావత్‌ ఒక రేసు మినహా అన్నింటిలో గెలిచి టాప్‌లో నిలిచాడు. బాలికల జూనియర్‌ లేజర్‌ ప్లీట్‌లో మాన్య అగ్రస్థానం దక్కించుకుంది.

ఇది కూడా చదవండి: ట్రైలర్‌ రిలీజ్‌ చేయాలంటూ ఫ్యాన్‌ సూసైడ్‌ లెటర్‌

Also Read :  తండ్రి మోసం కూతురి మరణం కేసు.. ముగ్గురు నిందితులకు రిమాండ్!

Advertisment
తాజా కథనాలు