/rtv/media/media_files/2025/04/23/0K2wSPj7rzIHbqOPVaOY.jpg)
Student suicide before intermediate results
తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు సంచలనం రేపుతున్నాయి. గత నెలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలు జరిగాయి. ఈ నెల ఏప్రిల్ 22న రిజల్ట్స్ వచ్చాయి. ఈ పరీక్షల ఫలితాల అనంతరం రాష్ట్రంలో విద్యార్థుల మరణాలు పెరిగిపోయాయి. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని కొందరు.. ఫెయిల్ అయ్యామని ఇంకొందరు.. పాస్ అవ్వమనే ఉద్దేశంతో రిజల్ట్స్‌కు ముందే చనిపోయిన వారు ఇంకొందరు.
Also read : AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!
ఇలా రాష్ట్రవ్యా్ప్తంగా పలు జిల్లాల్లో ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. మొత్తంగా ఇప్పటి వరకు 6 గురు విద్యార్థులు సూసైడ్ చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అందులో ఓ విద్యార్థి రిజల్ట్స్ రాకముందే సూసైడ్ చేసుకుని మరణించాడు. తీరా ఫలితాలు వచ్చాక అతడు పాసయ్యాడు. దీంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ
రిజల్ట్స్ రాకముందే సూసైడ్
గద్వాల్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఇటీవల ఇంటర్ ఎగ్జామ్స్ రాశాడు. అయితే పరీక్షలు బాగా రాయలేదనే మనస్థాపంతో రిజల్ట్స్ రాకముందే పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. అయితే ఏప్రిల్ 22న ఫలితాలు వచ్చిన తర్వాత అతడు 391 మార్కులతో పాసయ్యాడు.
ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం
దీంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని 6గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. హైదరాబాద్ లో ముగ్గురు, మేడ్చల్ పరిధిలో ఒకరు, మంచిర్యాల జిల్లాలో ఒకరు.. యాదాద్రి భువనగిరి జిల్లాలో బలవన్మరణానికి పాల్పడ్డారు.
crime news | inter-students-suicides | students-suicides | telangana | telugu-news | latest-telugu-news
Follow Us