/rtv/media/media_files/2025/04/23/XVbtkU1S550eQUgNRf1S.jpg)
Unknown bike Found Near Pahalgam
పహల్గాం దాడికి తామే పాల్పడ్డట్టు పాకిస్తాన్‌కు చెందిన టెర్రర్గ్రూపు లష్కరే -తోయిబా స్థానిక శాఖ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ప్రకటించింది. 2017 తరకవాత జమ్మూ కాశ్మీర్ లో దాడి జరగడం ఇదే మొదటిసారి. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి కూడా ఇదే. ఉగ్రవాదులు ఈసారి కూడా అచ్చంగా 26/11 ముంబై దాడుల తరహాలోనే చేశారు. పహల్గామ్ దాడిలో మొత్తం 26 మంది చనిపోయారు.
Also Read : 'వాళ్లని వదలొద్దు'.. ఉగ్రదాడిపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
Also Read : ఉగ్రదాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న బాలీవుడ్ జంట!
నంబర్ ప్లేట్ లేని బైక్..
దాడి జరిగిన దగ్గర నుంచి భద్రతా దళాలు ఉగ్రవాదులను పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో కొంత ప్రోగ్రస్ జరిగినట్లు తెలుస్తుంది. పహల్గామ్ లో దాడి జరిగిన ప్రదేశానికి కొంత దూరంలో ఒక బైక్ ను గుర్తించాయి. దీనికి నంబర్ ప్లేట్ లేదు. టెర్రరిస్టులు దీన్ని ఉపయోగించినట్లు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. బైక్ ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నాయి. మరోవైపు ఘటనా స్థలానికి ఈరోజు ఎన్ఐఏ బృందాలు రానున్నాయి.
today-latest-news-in-telugu | Pahalgam attack | terrorists | bike
Also Read: BIG BREAKING: వైసీపీ నుంచి దువ్వాడ ఔట్.. జగన్ సంచలన ప్రకటన!
Also Read : ఉగ్రదాడిలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా