/rtv/media/media_files/2025/05/02/nMBGynuTusBGBnzsHHQW.jpg)
TGSRTC
తెలంగాణ ఆర్టీసీ(TGSRTC) ప్రయాణాలను మరింత సులభతరం చేస్తూ.. బస్‌పాస్‌ల స్థానంలో స్మార్ట్ కార్డు(Smart Card) లను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. తొలుత విద్యార్థుల బస్‌పాస్‌లను స్మార్ట్‌కార్డులుగా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే.. మహాలక్ష్మి పథకం మహిళలకు కూడా దీన్ని వర్తిస్తుంప జేస్తారు. ఇతర రాష్ట్రాల స్మార్ట్‌కార్డుల వ్యవస్థను పరిశీలించి.. ఆన్‌లైన్ రెన్యూవల్, ఆధార్ కార్డు అవసరం లేకుండా ప్రయాణించే సౌలభ్యం కలిపించేందుకు ఆర్టీసీ సమాయత్తమవుతోంది.
ఇది కూడా చూడండి:Ganesh Nimajjanam 2025: వినాయక నిమజ్జనాల్లో అపశ్రుతి.. క్రేన్ తెగి పడి ఇద్దరు.. నీటిలో కొట్టుకుపోయి మరికొరు..!
Smart Travel In Telangana RTC Buses
ఈ స్మార్ట్‌కార్డుల అమలు చేయడం వల్ల ప్రయాణికులకు, ఆర్టీసీకి అనేక ప్రయోజనాలు కలగనున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం బస్‌పాస్‌లను రెన్యూవల్ చేయాలంటే బస్‌పాస్ కౌంటర్లకు వెళ్లాల్సి ఉంటుంది. వాటి స్థానంలో స్మార్ట్‌కార్డులు వస్తే వాటిని మొబైల్ రీఛార్జ్ చేసుకున్నంత సులభంగా ఆన్‌లైన్‌లోనే రెన్యూవల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలు బస్సులో ప్రయాణించేటప్పుడు ఆధార్ కార్డు చూపించాలి. స్మార్ట్‌కార్డులు వస్తే ఈ అవసరం ఉండదు. ప్రయాణికులు తమ స్మార్ట్‌కార్డును చూపించి ఈజీగా ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. ఈ స్మార్ట్‌కార్డుల ద్వారా ఏ రూట్‌లో ఎంతమంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు, ఏ విద్యార్థి ఎన్నిసార్లు బస్సు ఎక్కుతున్నాడు తదితర వివరాలన్ని ఆర్టీసీకి లభిస్తాయి. ఈ సమాచారం బస్సు రూట్లను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి, రద్దీగా ఉండే మార్గాల్లో అదనపు బస్సులను ఏర్పాటు చేయడానికి ఉపకరిస్తుంది.
ఇది కూడా చూడండి:Balapur Ganesh Laddu: కోటి ఖర్చైనా పర్లేదు..బాలాపూర్ లడ్డూకు ఈ సారి భారీ పోటీ!
ఈ విధానాన్ని స్టడీ చేయడానికి తెలంగాణ ఆర్టీసీ అధికారులు ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న స్మార్ట్‌కార్డుల విధానాలను అధ్యయనం చేస్తున్నారు. ముంబయి, బెంగళూరు, లక్నో నగరాల్లోని బస్సుల్లో ఎలాంటి ఫీచర్లు అమల్లో ఉన్నాయో పరిశీలిస్తున్నారు. ఈ అధ్యయనం ద్వారా తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు అత్యుత్తమ సేవలు అందించేలా కార్డ్‌లను డిజైన్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులు, లక్షలాది మంది మహిళా ప్రయాణికులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది. డిజిటల్ చెల్లింపుల దిశగా ఆర్టీసీ తీసుకుంటున్న ఈ చర్యలు ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించడానికి దోహదపడే అవకాశం ఉంది.
ఇది కూడా చూడండి:TG Dasara Holidays: తెలంగాణ స్టూడెంట్స్ కు అదిరిపోయే శుభవార్త.. దసరా సెలవులు ప్రకటించిన సర్కార్.. లిస్ట్ ఇదే