Business: ముందుకూ, వెనక్కూ ఊగిసలాడుతున్న స్టాక్ మార్కెట్లు

మొదలవ్వడమే ఫ్లాట్ గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు అక్కడి నుంచి తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్నాయి. కాసేపటి క్రితమే నష్టాల్లో ట్రేడ్ అయిన సెన్సెక్స్,నిఫ్టీలు ప్రస్తుతం లాభాలబాట పట్టాయి.సెన్సెక్స్ 500 పాయింట్లు పెరగ్గా.. నిఫ్టీ కూడా 150 పాయింట్లు పెరిగింది.

New Update
Stock Market,

ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 28 పాయింట్ల నష్టంతో 75,142 వద్ద.. నిఫ్టీ 20 పాయింట్లు తగ్గి 23,024 వద్ద మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. ఆ తరువాత చాలా సేపు అటూ ఇటూగా ఊగిసలాడింది. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ ఫలితాలు దేశీ మార్కెట్ మీద బాగా ప్రభావం చూపిస్తున్నాయి.  వాణిజ్య యుద్ధ భయాలతో వరుసగా నష్టాల్లోకి జారుకున్న సూచీలు  ప్రస్తుతం లాభ-నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. 

లాభాల బాటలో..

అయితే తాజాగా కొంతసేపటి క్రితమే సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల దారిలోకి వచ్చాయి. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా పెరుగుదలతో 76,670 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 150 పాయింట్లు పెరిగి 23,200 స్థాయిలో ట్రేడవుతోంది. సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో 24 లాభపడ్డాయి మరియు 6 నష్టపోయాయి. నిఫ్టీలోని 50 స్టాక్స్‌లో 44 లాభపడ్డాయి, 6 నష్టపోయాయి. NSE రంగాల సూచీలలో, ఫార్మా రంగం అత్యధికంగా లాభపడి, 1.77% లాభపడింది. మరోవైపు ఆసియా మార్కెట్లో కొరియా కోస్పి 0.89% పెరగ్గా.. హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ 1.56%, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 0.12% క్షీణించాయి. అమెరికా డౌ జోన్స్ 0.50% క్షీణతతో 44,368 వద్ద ముగిసింది. ఎస్ అండ్ పి 500 ఇండెక్స్ 0.27% తగ్గి 6,051 వద్ద ముగిసింది. నాస్‌డాక్ 0.031% పెరిగింది. ఇక నిన్న విదేశీ మదుపర్లు రూ.4,969.30 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఇదే సమయంలో దేశీయ పెట్టుబడిదారులు  రూ.5,929.24 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

Also Read: MEIL: మేఘా కృష్ణారెడ్డికి బిగ్ షాక్.. ముంబై హైకోర్టులో జర్నలిస్ట్ రవి ప్రకాష్ పిల్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు