KCR Cutout : కేసీఆర్ కటౌట్కు నిప్పు.. తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్!
తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కటౌట్ కు ఓ వ్యక్తి నిప్పు పెట్టాడు. పార్టీ కార్యాలయం వద్ద ఉన్న కార్యకర్తలు నేతలు వెంటనే నిప్పుపెట్టిన వ్యక్తిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో కటౌట్ పాక్షికంగా కాలిపోయింది.