Jeevan Reddy : మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత, మాజీమంత్రి జీవన్‌రెడ్ది అస్వస్థకు గురయ్యారు. నిన్న రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపుడుతుండటంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన బేగంపేటలోని కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

New Update
FotoJet (21)

Former MLC Jeevan Reddy unwell, shifted to hospital

కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత, మాజీమంత్రి జీవన్‌రెడ్ది(MLC Jeevan Reddy Issue) అస్వస్థకు గురయ్యారు. నిన్న రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపుడుతుండటంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన బేగంపేటలోని కిమ్స్‌ ఆసుపత్రి(kims hospital) లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆయనను పరీక్షించిన వైద్యులు జీవన్ రెడ్డికి ఫుడ్ పాయిజన్ కావడం వల్లే వాంతులు, వీరేచనాలు అయ్యాయని దీంతో శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని.. అందువల్లే ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

అయితే ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల సమయంలో జీవన్‌ రెడ్డి బలపరిచిన అభ్యర్థుల విజయం కోసం ఆయన క్రీయశీలకంగా పనిచేశారు. తను బలపరిచిన అభ్యర్థిని చైర్మన్‌ చేయడం కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అధిష్టానం మాత్రం ఎమ్మెల్యే సంజయ్‌(jagityal mla sanjay kumar) వర్గానికి చైర్మన్‌, జీవన్‌ రెడ్డి వర్గానికి వైస్‌ చైర్మన్‌ కేటాయించింది. అయితే ఆయన ఎన్నికల సమయంలో సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, నిద్రసరిగా లేకపోవడం, వాతవరణ మార్పులు తదితర కారణాల వల్ల అనారోగ్యానికి గరయ్యారని ఆయన అనుచరులు చెబుతున్నారు. కాగా నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని జీవన్‌ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని  కుటుంబ సభ్యులు తెలిపారు. - MLA Sanjay vs Jeevan Reddy

Also Read :  హైదరాబాద్‌లో మరో కుట్రకు 'లష్కరే తోయిబా' యత్నం.. ఏకంగా - చంచల్​గూడ జైలు నుంచే మాస్టర్ ప్లాన్‌

పరామర్శించిన మంత్రి అడ్లూరి

కాగా అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన మాజీమంత్రి జీవన్‌ రెడ్డి(Congress MLC Jeevan Reddy) మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌(laxman-kumar-adluri) ఈ రోజు ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జీవన్ రెడ్డి ఆనారోగ్యం విషయం తెలుసుకున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్నారు. సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి జీవన్ రెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆకాంక్షించారు.

Also Read :  అమీర్‌పేట కోచింగ్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం.. స్పాట్‌లో 60 మంది విద్యార్థులు

Advertisment
తాజా కథనాలు