/rtv/media/media_files/2026/02/20/fire-accident-at-ameerpet-today-2026-02-20-14-54-03.jpg)
fire accident at Ameerpet today
అమీర్‌పేటలోని ఒక కోచింగ్ సెంటర్(coaching-center) లో ఘోర అగ్నిప్రమాదం(fire accident hyderabad) చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో కోచింగ్ సెంటర్‌లో 60 మంది విద్యార్థిని, విద్యార్థులు ఉండటంతో కలకలం చెలరేగింది. మైత్రివనం(mythrivanam) లోని నీలగిరి బ్లాక్‌లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. మైత్రివనం నీలగిరి బ్లాకులోని నాలుగో అంతస్తులో ఉన్న ఓ ఇన్‌స్టిట్యూట్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో కొందరు విద్యార్థులు అందులో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నిచ్చెన సహాయంతో అక్కడ చిక్కుకున్న సుమారు 60 మంది విద్యార్థులను అతి కష్టం మీద బయటకు తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Also Read : దారుణం.. డబుల్ బెడ్ రూం ఇంట్లో 8వ తరగతి బాలికపై గ్యాంగ్ రేప్
Fire at Ameerpet Coaching Center
fire accident at Ameerpet today. pic.twitter.com/8jPY47YsHs
— Hannu (@Hannubabu) February 20, 2026
మైత్రివనంలోని నీలగిరి బ్లాక్ భవనంలో అగ్నిప్రమాదం
— Telugu Scribe (@TeluguScribe) February 20, 2026
నాలుగవ అంతస్తులోని ఇన్‌స్టిట్యూట్‌లో చిక్కుకున్న విద్యార్ధులను నిచ్చెనల ద్వారా కిందకి దించుతున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు https://t.co/miDbmt31onpic.twitter.com/fUSaMqhlVe
Also Read : ఫోన్ పేలో లంచాలు.. 8 మంది ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు
కాగా ఈ ప్రమాదంతో మైత్రవనంలో ఒక్కసారిగా భారీగా పొగలు కమ్ముకున్నాయి. కాగా అగ్ని మాపక సిబ్బంది మంటల్ని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటల కారణంగా భవనమంతా దట్టమైన పొగ అలుముకుంది. దీనితో సహాయ చర్యలకు అంతరాయం ఏర్పడింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీంతో విద్యుత్ సరఫరాను నిలిపివేసి ప్రమాదం మరింత తీవ్రం కాకుండా అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. మంటలు మరిన్ని షాపులకు విస్తరించకుండా ఉండటం కోసం నీలగిరి బ్లాక్‌లోని షాపులను మూసివేయించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోని ప్యానెల్ బోర్డులో షార్ట్‌సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు అధికారులు అంచనా వేశారు. మంటలు మూడు అంతస్తు వరకు వ్యాపించినట్లు పోలీసులు తెలిపారు. పై అంతస్తులోని కొన్ని ఐటీ సంస్థల్లో కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు మెట్ల మార్గం ద్వారా బయటకు వచ్చారు. మరికొందరిని అగ్నిమాపక సిబ్బంది బాల్కనీ ద్వారా, మెట్ల ద్వారా సురక్షితంగా కిందకు చేర్చారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది.
బ్రేకింగ్ న్యూస్
— Telugu Scribe (@TeluguScribe) February 20, 2026
మైత్రివనం - నీలగిరి బ్లాక్ భవనంలో అగ్నిప్రమాదం
నాలుగవ అంతస్తులోని ఇన్‌స్టిట్యూట్‌లో చిక్కుకున్న విద్యార్ధులు
ప్రాణాలు రక్షించుకునేందుకు బాల్కనీ నుండి కింది అంతస్తులకు దిగిన విద్యార్థులు
పైన చిక్కుకున్న మరికొంత మంది విద్యార్థులను బాల్కనీ నుండి కాపాడే ప్రయత్నం… pic.twitter.com/lwM9wJRWTM
Follow Us