VIRAL VIDEO: హైదరాబాద్‌లో అక్కడ జ్యూస్‌లు తాగారంటే చచ్చారే.. వాంతులే వాంతులు- వీడియోలు వైరల్

ఫుడ్‌సేఫ్టీ అధికారులు హైదరాబాద్‌లోని పలు షాపులపై దాడులు చేశారు. అమీర్‌పేటలోని కోకోనట్ జ్యూస్‌బార్‌‌లో ఫ్రూట్స్ కుల్లిపోయినట్లుగా గుర్తించారు. ఫ్రిడ్జ్‌లో కీటకాలు, బొద్దింకలు ఉన్నట్లు తెలిపారు. తుప్పుపట్టిన కత్తులను గుర్తించి వారిపై చర్యలు తీసుకున్నారు.

New Update
Food safety officials raided several shops in Hyderabad

Food safety officials raided several shops in Hyderabad

ఏరా.. ఆకలేస్తుంది హోటల్‌లో భోజనం చేద్దామా.. వద్దురా బాబు. బతికుంటే బలుసు ఆకు అయినా తినొచ్చు కానీ.. హోటల్‌లో మాత్రం భోజనం చేయను. ఎందుకు రా.. ఎందుకు అంటావేంట్రా బాబు.. హోటల్ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియట్లేదా?.. ఏది తిందామన్నా కల్తీ.. భోజనం తినేటప్పుడు ఏవేవో వస్తున్నాయి. పోనీ.. డ్రింక్స్, జ్యూస్ వంటివి ఏమైనా తాగుదామా అంటే అవి కూడా పాడైపోయినవే ఇస్తున్నారు. కుల్లిపోయిన పండ్లతో జ్యూస్ చేస్తున్నారు. అవి కానీ తాగామంటే డైరెక్ట్ అనంతలోకాలకే అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు. 

Also Read :  కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు ఏపీ వాసుల దుర్మరణం!

మరికొందరు తమకు హోటల్, రెస్టారెంట్లలో ఎదురైన చేదు అనుభవాలను ఫుడ్ సేఫ్టీ అధికారులకు చెప్పి కంప్లైంట్ ఇస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతుండటంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగి పలు హోటల్, రెస్టారెంట్లపై రైడ్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా హైదరాబాద్‌లో దాడులు నిర్వహించారు. వారి దాడుల్లో సంచలన విజువల్స్ బయటకొచ్చాయి. 

Also read: Lady Don: హాట్ టాపిక్‌గా లేడీ డాన్ జిక్రా.. ఏకంగా ఢిల్లీ సీఎం వార్నింగ్

వాంతులొచ్చే విజువల్స్

తాజాగా వెంగల్‌రావ్ నగర్‌లోని ఏ1 ఫ్రూట్ అండ్ జ్యూస్ షాప్‌ను తనిఖీ చేశారు. అందులో జ్యూస్ తయారీ ప్రాంతంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదని గుర్తించారు. రిఫ్రిజిరేటర్ చాలా తుప్పు పట్టి, అపరిశుభ్రమైన స్థితిలో ఉందని తెలిపారు. అలాగే తుప్పు పట్టిన ఇనుప కత్తులు కనుగొన్నారు. 

దీని తర్వాత అమీర్‌పేటలోని మెయిర్‌రోడ్‌లో గల వినత కాంప్లెక్స్‌లో కోకోనట్ జ్యూస్ బార్‌ షాప్‌పై తనిఖీలు చేశారు. అందువలో వారికి విస్తుపోయే విజువల్స్ కనిపించాయి. రిఫ్రిజిరేటర్‌లో కీటకాలు, బొద్దింకలు కనిపించాయి. రిఫ్రిజిరేటర్‌లో కుళ్ళిన పండ్లు గుర్తించారు. చెత్తబుట్టలు తెరిచి ఉన్నట్లు కనుగొన్నారు. 

ఇంకా అమీర్‌పేటలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న కెజీఎన్ జ్యూస్ సెంటర్‌ను తనిఖీ చేశారు. అక్కడ కూడా లైసెన్స్ లేకుండా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. జ్యూస్ తయారు చేసే ప్రాంతంలో చాలా ఈగలు ఉన్నట్లు తెలిపారు. చెడిపోయిన ఫ్రూట్ సలాడ్‌ను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసినట్లు గుర్తించారు. లేబుల్ చేయని ఆహార పదార్థాలు కనిపించాయి. పక్కనే ఉన్న స్థలం అపరిశుభ్రమైన స్థితిలో ఉన్నట్లు కనుగొన్నారు. అనంతరం ఈ షాపులు అన్నింటికీ నోటీసులు ఇచ్చారు. 

telugu-news | food | latest-telugu-news | food lovers | Ameerpet

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు