Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌లోని పటాన్‌చెరు పారిశ్రామికవాడలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆదివారం సాయంత్రం ఈ విషాదం చోటుచేసుకుంది.

New Update
Fire Accident

Fire Accident

హైదరాబాద్‌(hyderabad)లోని పటాన్‌చెరు పారిశ్రామికవాడలో ఘోర అగ్నిప్రమాదం(fire accident) జరిగింది. రూప కెమికల్ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆదివారం సాయంత్రం ఈ విషాదం చోటుచేసుకుంది. సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మూడు ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఫ్యాక్టరీలో కార్మికులు ఎవరూ లేరని తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ అగ్నిప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై క్లారిటీ లేదు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Also Read :  ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది మృతి

Chemical Factory Fire Accident In Hyderabad

Also Read :  నెల్లూరులో ఘోరం.. ముగ్గుర్ని మింగేసిన సముద్రం

Advertisment
తాజా కథనాలు