/rtv/media/media_files/2025/11/02/rajasthan-2025-11-02-21-09-05.jpg)
రోడ్డు ప్రమాదం(road accident) లో 18 మంది మృతి చెందిన ఘోర విషాద ఘటన రాజస్థాన్(rajasthan) లో ఆదివారం చోటుచేసుకుంది. ఫలౌదీ పరిధిలోని జాతీయ రహదారిపై జరిగిన ఈ యాక్సిడెంట్‌లో మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలైయ్యాడు. ప్రయాణికులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ అదుపుతప్పి ఆగి ఉన్న కంటైనర్ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రయాణికులతో వేగంగా వెళ్తున్న టెంపో వ్యాన్ డ్రైవర్ రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ వాహనాన్ని గుర్తించలేకపోయాడు. కంటైనర్ వెనుక నుంచి టెంపో ట్రావెలర్ బలంగా ఢీకొట్టింది. దీంతో టెంపో ట్రావెలర్ ముందు భాగం నుజ్జునుజ్జు అయింది.
Also Read : NHAI: నేషనల్ హైవేలపై యాక్సిడెంట్లు.. కేంద్రం కీలక నిర్ణయం
Road Accident In Rajasthan
फलोदी जिले में भीषण सड़क हादसा,18 से ज्यादा लोगों की मौत
— Hemang barua (@BaruaHemang) November 2, 2025
मतोड़ा थाना क्षेत्र में हुई घटना
टेंपो ट्रैवलर ट्रक में घुसा
बड़ी संख्या में हताहत#jodhpur#accidentpic.twitter.com/9bId0IMCvi
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాద సమయంలో టెంపో ట్రావెలర్‌లో 20 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ దుర్ఘటనలో మొత్తం 18 మంది అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం.
Also Read : అయ్యో పాపం.. బీచ్‌కు వెళ్లి నలుగురు యువతులు మృతి
Follow Us