Mypadu beach: నెల్లూరులో ఘోరం.. ముగ్గుర్ని మింగేసిన సముద్రం

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మైపాడు బీచ్‌లో సరదాగా స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతైయ్యాయి. మొత్తం ఐదుగురు యువకులు బీచ్‌లో స్నానానికి వెళ్లగా.. అందులో ముగ్గురు అలల తాకిడికి సముద్రంలోకి కొట్టుకుపోయారు.

New Update
beach

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆదివారం కావడంతో మైపాడు బీచ్‌లో సరదాగా స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతైయ్యాయి. మొత్తం ఐదుగురు యువకులు బీచ్‌లో స్నానానికి వెళ్లగా.. అందులో ముగ్గురు అలల తాకిడికి సముద్రంలోకి కొట్టుకుపోయారు. కొద్దిసేపటి తర్వాత ముగ్గురి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మృతులు నారాయణపేటకు చెందిన ఇంటర్‌ విద్యార్థులు హుమాయున్, తాజిన్, ఆదిల్‌గా పోలీసులు గుర్తించారు. దీంతో మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటీవల తుపాను ప్రభావంతో సముద్రం ఉద్ధృతంగా ఉండటం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. కోవూరు సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్సై నాగార్జునరెడ్డి సంఘటన స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సెలవు కావడంతో ఐదుగురు యువకులు కలిసి మైపాడు బీచ్‌కు వెళ్లారు. వీరిలో ముగ్గురు స్నానం కోసం సముద్రంలోకి దిగారు. బలమైన అలల తాకిడికి వారు లోపలికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు. వీరిని కాపాడేందుకు స్థానిక మత్స్యకారులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కొద్దిసేపటి తర్వాత విద్యార్థుల మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. సమాచారం అందుకున్న మెరైన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

స్థానిక హెచ్చరికలు:

బీచ్‌కి వచ్చినవారు హెచ్చరికలను పట్టించుకోకుండా సముద్రంలోకి వెళ్లడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్న దృష్ట్యా, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని స్థానిక నాయకులు, పోలీసులు కోరారు.

Advertisment
తాజా కథనాలు