మాదాపూర్‌లో మరోసారి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం అయ్యప్ప సొసైటీలోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లో నిపున్ ఐటీ సొల్యూషన్స్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీలో మంటలు చెలరేగాయి. సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పేశారు. ఈ ప్రమాదంలో కంపెనీలో ఉన్న సామాగ్రి, ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయాయి. Also Read: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు..! భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మిగితా కార్యాలయాల్లో ఉన్న సిబ్బంది కూడా భయంతో బయటకు పరుగులు తీశారు. నూతన సంవత్సరం వేళ ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీకి సెలవు కావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే ప్రమాదం ఎలా జరిగిందో అనేదానిపై క్లారిటీ లేదు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు. Also Read: ముంబయి కోర్టు సంచలన తీర్పు.. 8 మంది పాకిస్థానీయులకు 20 ఏళ్ల జైలుశిక్ష.. ఇదిలాఉండగా.. ఇటీవల మాదాపూర్‌లోనే పలు అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇనార్బిట్‌మాల్ ఎదురుగా ఉన్న సత్వ సాఫ్ట్‌వేర్ కంపెనీలో మంటలు చెలరేగాయి. దీంతో కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు పెట్టారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. రెండు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఖానామెట్‌లోని మీనాక్షి టవర్స్‌లో మంటలు చెలరేగాయి. దాదాపు మూడు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. Also Read: Infosys: మన ఆఫీసులో పులిగారున్నారు..మీరు ఇంటి నుంచే పని చేయండి! Also Read: కొత్త సంవత్సరం మొదటి రోజే..తల్లి,నలుగురు చెల్లెళ్లను చంపేసిన కిరాతకుడు!