బీజేపీ స్టేట్ చీఫ్గా ఈటల రాజేందర్ | Telangana BJP New Cheif Updates | RTV
బీజేపీ స్టేట్ చీఫ్గా ఈటల రాజేందర్ | BJP Circles in Telangana spreads talk that BJP New Cheif is going to be MP Eetela Rajender | RTV
బీజేపీ స్టేట్ చీఫ్గా ఈటల రాజేందర్ | BJP Circles in Telangana spreads talk that BJP New Cheif is going to be MP Eetela Rajender | RTV
వేములవాడ టికెట్ ను తుల ఉమకు ఇవ్వడంతో వికాస్ రావు వర్గీయులు భగ్గుమంటున్నారు. టికెట్ మార్చుకుంటే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో బీజేపీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఉత్కంఠగా మారింది.
బీసీ మహిళనైన తనకే వేములవాడ బీజేపీ టికెట్ దక్కుతుందని తుల ఉమ ధీమా వ్యక్తం చేశారు. తనను గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బండి సంజయ్ తనకు సోదరుడితో సమానమని.. ఆయన తన టికెట్ కు ఎందుకు అడ్డుపతున్నాడో అర్థం కావడం లేదన్నారు.
తెలంగాణపై ఫోకస్ పెట్టిన బీజేపీ అధిష్టానం.. ప్రచార పర్వంలోకి అగ్రనేతలను దించేందుకు ప్లాన్ చేస్తోంది. 20న స్మృతీ ఇరానీ, 27న అమిత్ షా, 28న అస్సాం హిమంత బిశ్వ శర్మ రాష్ట్రంలో పర్యటించేలా షెడ్యూల్ విడుదల చేసింది బీజేపీ.
తెలంగాణ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించానికి సిద్ధమవుతున్న బీజేపీకి భారీ షాక్ తగిలే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ బాపురావు, వరంగల్ జిల్లాకు చెందిన కీలక నేతల రేవూరి ప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సాయంత్రం జరగాల్సిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాన్ని వాయిదా వేశారు.
పూసల వాళ్ళ వృత్తి ఒకప్పుడు గొప్పగా ఉండేదని.. కానీ ఈనాడు ఆ పరిస్థితి లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. గతి లేక ఈ పని చేస్తున్నారన్నారు. భీమా కింద రైతుకు, కల్లు గీత కార్మికులకు, మత్యకారులకు, గొర్ల కాపరులకు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారని.. కానీ రైతుకూలీలకు మిగిలిన పేదవారికి ఇవ్వడంలేదన్నారు ఈటల. మేము అధికారంలోకి వస్తే తెల్లరేషన్ కార్డు ఉన్న 59 సంవత్సరాల లోపు ఎవరు చనిపోయిన ప్రతి ఒక్కరికీ 5 లక్షల రూపాయలు స్కీమ్ మ్యానిఫెస్టోలో పెడతామన్నారు ఈటల.
బీజేపీ మాజీ ఎమ్మెల్యేను ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఇటీవల గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. అందుకే తాను గోషామహల్లో పర్యటించినట్లు ఈటల రాజేందర్ తెలిపారు. నియోజకవర్గంలో బీజేపీ నాయకులపై, కార్పోరేట్పై తప్పుడు కేసులు పెడుతూ బీఆర్ఎస్ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఈటల మండిపడ్డారు.