/rtv/media/media_files/2025/02/01/zJDk39nZJqJPIoqB4XBZ.jpg)
Blood Pressure
మారిన జీవనశైలి వల్ల చాలా మంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. అయితే రక్తపోటు అదుపులో ఉంటేనే ఆరోగ్యం. కాస్త ఎక్కువైనా, తక్కువైనా కూడా ప్రమాదమే. ప్రస్తుతం రోజుల్లో పోషకాలు లేని ఫుడ్ తీసుకోవడం, మసాలా ఫుడ్ తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉండకుండా పెరుగుతుంది. అయితే హైబీపీ ఈ 5 అలవాట్ల వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ అలవాట్లు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి:Vivo X200 FE: అబ్బా తమ్ముడూ.. Vivo నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్.. కెమెరా సూపరెహే!
అధిక ఉప్పు తీసుకోవడం
నేటి జీవనశైలిలో, చిప్స్, నమ్కీన్, ఫాస్ట్ ఫుడ్ లో అధికంగా సోడియం ఉంటుంది. ఉప్పు శరీరంలో నీటిని నిలుపుకుంటుంది. రక్త నాళాలపై ఒత్తిడిని పెంచుతుంది. దీనివల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిశ్చల జీవనశైలి
యువత కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చోవడం, ఆఫీసు పని చేయడం, వ్యాయామం లేకపోవడం వల్ల రక్త ప్రసరణ బలహీనపడుతుంది. ఇది ఒత్తిడిని పెంచుతుంది. దీంతో అధిక రక్తపోటు వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చూడండి:Axiom-4 mission: ISS నుంచి శుభాంశు శుక్లా తెస్తున్న 263కేజీల నిధి.. ఏంటో తెలిస్తే షాక్!
నిద్ర లేకపోవడం
ఒత్తిడి వల్ల సరిపడా నిద్రపోరు. దీనివల్ల కూడా హైబీపీ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. తక్కువ నిద్రపోవడం వల్ల కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల రక్తపోటు పెరుగుతుంది.
జంక్ ఫుడ్, కెఫిన్
బర్గర్లు, పిజ్జా, శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం యువతలో సర్వసాధారణం. ఈ ఆహారాలలో అధిక కెఫిన్, సోడియం కంటెంట్ రక్తపోటును పెంచుతుంది. ఇది అధిక రక్తపోటుకు దారితీస్తుంది.
ఇది కూడా చూడండి:Radhika Yadav: పొట్టి బట్టలు వేసుకున్నందుకే హత్యా?.. రాధికా కేసులో ఫ్రెండ్ సంచలన విషయాలు
ధూమపానం, మద్యపానం
చిన్నప్పటి నుండే సిగరెట్లు తాగడం లేదా మద్యం సేవించడం వల్ల రక్త నాళాలు సంకోచిస్తాయి. నికోటిన్, ఆల్కహాల్ హృదయ స్పందనలు సక్రమంగా లేకపోవడం రక్తపోటు పెరగడం వంటి వాటికి కారణమవుతాయి.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి:BIG BREAKING: తుంగతుర్తిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే కిశోర్ తో పాటు బీఆర్ఎస్ కీలక నేతల అరెస్ట్!
salt | smoking | blood-pressure