/rtv/media/media_files/2025/11/17/eetala-rajendar-responds-on-jubileehills-bypoll-results-2025-11-17-19-01-31.jpg)
eetala rajendar responds on jubileehills bypoll results
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. బీజేపీ అభ్యర్థిని చివరివరకు ప్రకటించకపోవడం అనేదే పెద్ద మైనస్ అన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికలకు 6 నెలల ముందు నుంచే గ్రౌండ్ వర్క్ చేశాయని పేర్కొన్నారు. హిందూ, ముస్లిం విభజన రాజకీయాలు చేసి రాష్ట్రంలో అధికారంలోకి రాలేమని పేర్కొన్నారు. రాజకీయ నేతలు మత ప్రతిపాదికన రాజకీయాలు చేయొద్దని సూచించారు.
Also Read: పోలీసులకు చుక్కలు చూపించిన ఏడో తరగతి బాలిక.. స్కూలుకు వెళ్లడం ఇష్టం లేక ఏం చేసిందంటే?
ఉప ఎన్నికల్లో అధికారిక పార్టీకే అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికల్లో మాత్రం బీజేపీ గెలిచిందని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడ్డాక ఇప్పటిదాకా 9 ఉపఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. అందులో అధికార పార్టీయే ఆరుసార్లు గెలిచిందని అన్నారు. రేవంత్ పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు హుజురాబాద్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 3 వేల ఓట్లు మాత్రమే వచ్చాయని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్.. దాదాపు 25 వేల ఓట్ల మెజార్టీతో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై గెలిచిన సంగతి తెలిసిందే.
Also Read: సౌదీలో మరణిస్తే మృతదేహాన్ని ఇవ్వరు.. ఈ రూల్ గురించి తెలుసా ?
Follow Us