Saudi Arabia: సౌదీలో మరణిస్తే మృతదేహాన్ని ఇవ్వరు.. ఈ రూల్‌ గురించి తెలుసా ?

సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాదీలు మృతి చెందారు. అయితే మక్కా, మదీనా లేదా ఇతర ప్రాంతాల్లో మతపరమైన యాత్రకు వెళ్లే సమయంలో ఎవరైనా మరణిస్తే.. వాళ్ల మృతదేహాన్ని తమ సొంత దేశానికి అప్పగించరు.

New Update
bodies of pilgrims who die in Saudi Arabia are not repatriated to their home countries

bodies of pilgrims who die in Saudi Arabia are not repatriated to their home countries

సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. యాత్రికులతో వెళ్తున్న బస్సు డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 45 మంది హైదరాబాదీలు మృతి చెందడం కలకలం రేపింది. మక్కా యాత్ర ముగించుకుని మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు మొత్తం అంటుకున్నాయి. ఆ సమయంలో యాత్రికులందరూ నిద్రిస్తుండటంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. మృతుల్లో 18 మంది మహిళలు, 17 మంది పురుషులు, 10 మంది చిన్నారులు ఉన్నారు. 

సౌదీ అరేబియాలో హజ్ లేదా ఉమ్రా వంటి మతపరమైన యాత్రలకు సంబంధించి కఠినమైన నియమాలున్నాయి. ఈ రూల్స్‌ ప్రకారం సౌదీలోని మక్కా, మదీనా లేదా ఇతర ప్రాంతాల్లో మతపరమైన యాత్రకు వెళ్లే సమయంలో ఎవరైనా మరణిస్తే.. వాళ్ల మృతదేహాన్ని తమ స్వంత దేశానికి అప్పగించరు. సౌదీలో ఎన్నో ఏళ్లుగా ఈ నియమం అమల్లో ఉంది. సౌదీలో మతపరమైన యాత్రకు సంబంధించి ప్రయాణికులకు ముందుగానే ఈ సమాచారం కూడా తెలియజేస్తారు. దీనికి దరఖాస్తు చేసుకునేటప్పుడు సంతకం కూడా చేయాల్సి ఉంటుంది. 

Also Read: సీఎం స్టాలిన్‌కు బాంబు బెదిరింపులు..చెన్నైలో హై అలర్ట్

సౌదీలో మక్కా, మదీనా నగరాలను అత్యంత పవిత్రమైన ప్రాంతాలుగా భావిస్తారు. అక్కడ మరణించడాన్ని ముస్లింలు అదృష్టంగా భావిస్తారు. మరణించినవారిని అల్లాహ్ క్షమిస్తాడని.. వారికి స్వర్గం లభిస్తుందని గట్టిగా నమ్ముతారు. ఏటా జరిగే హజ్‌ యాత్రలో ఎంతోమంది యాత్రికులు, ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు అక్కడి వాతావరణం, రద్దీ కారణంగా మరణిస్తారు. ఇస్లాం ఆచారం ప్రకారం మరణించిన వాళ్లను 24 గంటల్లోపే ఖననం చేయాలి. అందుకే ఈ మతపరమైన నమ్మకాలు, భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌదీ అరేబియా ప్రభుత్వం మ-ృతదేహాలను అక్కడే ఖననం చేసే నియమాన్ని ఎప్పటినుంచో అమలు చేస్తోంది.

యాత్రికలు సౌదీలో మరణిస్తే వాళ్ల మృతదేహాలు కుటుంబ సభ్యులు కోరినా పంపేందుకు అనుమతి ఉండదు. ఎందుకంటే హజ్ లేదా ఉమ్రా యాత్ర కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడే.. వారు ఒకవేళ సౌదీలో మరణిస్తే అక్కడే ఖననం చేయడానికి అంగీకరిస్తూ సంతకం చేయాల్సి ఉంటుంది. కానీ ఉపాధి లేదా నివాసం కోసం సౌదీ అరేబియాలో ఉంటూ మరణించిన వాళ్లని మాత్రం స్వదేశానికి పంపేందుకు అనుమతి ఉంటుంది. 

Also Read: సీఎం స్టాలిన్‌కు బాంబు బెదిరింపులు..చెన్నైలో హై అలర్ట్

Advertisment
తాజా కథనాలు