/rtv/media/media_files/2025/04/28/TUIY0FBwW3vVk7oOGfAb.jpg)
ED Raids In Hyderabad Old City
Bigbreaking: తెలంగాణలో మరోసారి ఈడీ సోదాలు తీవ్ర కలకలం సృష్టించాయి. భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. పాతబస్తీలోని పలువురి ఇళ్లలో సోదాలు కొనసాగాయి. వివరాల ప్రకారం.. తెలంగాణలో భూదాన్ భూములు, మహేశ్వరం భూముల వ్యవహారంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. భూదాన్ భూములను అక్రమంగా ఆక్రమించి లే-అవుట్ చేసి మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసా అనే వ్యక్తులు అమ్మకాలు జరిపారు. దాదాపు వంద ఎకరాల భూమిని విక్రయించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు రంగంలోకి దిగి.. పాతబస్తీలో మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నిస్, శర్పాన్, సుకుర్ ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ఇక, గతంలో ఇదే కేసులో ఐఏఎస్ అమాయ్ కుమార్‌ను ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.యాకుత్‌పురా, సంతోష్‌నగర్ పరిసర ప్రాంతాల్లోని కొన్ని నివాసాల్లో ఈ సోదాలు జరిగాయి.
ED Raids Rock Old City Hyderabad: Top Officials Under Fire Over Illegal Land Deals pic.twitter.com/TBNleepfXQ
— Raftaar-e-Deccan (@raftaaredeccan) April 28, 2025
Also Read: వాడో జోకర్.. మోదీజీ పాకిస్తాన్‌ను FATF బ్లాక్‌లిస్ట్‌లో చేర్చండి: అసదుద్దీన్ ఒవైసీ
భూదాన్ భూముల వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఈఐపీఎల్ సంస్థ లావాదేవీలపై ఈడీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ సంస్థ పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కూడా భూములు విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈఐపీఎల్ సంస్థకు సుకూర్ అనే వ్యక్తి బినామీగా వ్యవహరించాడనే అనుమానంతో ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుకూర్‌తో పాటు అతని బంధువు షర్ఫన్, మరో ఇద్దరు వ్యక్తుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.ఈ సోదాల్లో భాగంగా ముఖ్యమైన పత్రాలు, లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను ఈడీ అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఇదే కేసులో గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన అమోయ్ కుమార్‌ను, మహేశ్వరం తహసీల్దార్‌ను కూడా ఈడీ అధికారులు విచారించారు.
Also read : Nandamuri Balakrishna పద్మ భూషణ్ అవార్డు అందుకున్న బాలయ్య.. ఫొటోలు వైరల్
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారంలోని 181, 182 సర్వే నెంబర్‌లో సుమారు 103 ఎకరాల భూదాన్ భూమి ఉంది. అయితే ఈ భూమిపై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఇందులో సుమారు 50 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయినట్లు తెలుస్తోంది. ఈ 50 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో.. వారు ఇందులో ప్లాట్లుగా విభజించి.. ప్రస్తుతం అమ్మకాలు చేపట్టారు. అయితే ఈ అంశం కోర్టులో పరిధిలో ఉంది. దీంతో కోర్టు.. ఆ భూములకు సంబంధించి లావాదేవీలపై స్టే విధించింది. అయితే ఈ అంశంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. సుమారు 50 ఎకరాల భూమి అన్యాక్రాంతం కావడంతో దీనిపై విజిలెన్స్ విచారణ జరిగిన తరువాత.. ఆ రిపోర్టు ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Also Read: పహల్గాం దాడిని పూర్తిగా షూట్ చేసిన వీడియోగ్రాఫర్.. కానీ
ఈడీ అధికారులు ఇప్పుడు ఈ భూముల అసలు యజమానులు ఎవరు, ఎవరెవరికి ఈ భూములు అక్రమంగా బదిలీ అయ్యాయి.. ఈ ప్రక్రియలో ఎవరెవరు లబ్ధి పొందారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా.. ఈఐపీఎల్ కంపెనీకి , సుకూర్‌కు మధ్య ఉన్న సంబంధం ఏమిటి..? ఈ భూముల విక్రయాలలో వారి పాత్ర ఏమిటి అనే విషయాలను ఈడీ నిశితంగా పరిశీలిస్తోంది.
Also Read: ఇండియాతో యుద్ధం వద్దు.. పాక్ మాజీ ప్రధాని కీలక సూచనలు
Also Read: పహల్గాం దాడికి ముందు ఉగ్రవాదులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి సంచలన నిజాలు