/rtv/media/media_files/2025/04/28/z40tYlGO98XgLrWzwRWW.jpg)
balayya honoured with padma bhushan award
Nandamuri Balakrishna ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పలు రంగాల్లో విశేష కృషి కనబరిచిన వ్యక్తులకు పద్మ భూషణ్ అవార్డులను ప్రకటించడం జరిగింది. ఇందులో సినీ పరిశ్రమకు సంబంధించి నందమూరి బాలకృష్ణ, అజిత్ కుమార్, శోభన, శేఖర్ కపూర్ తదితరులకు పద్మ భూషణ్ అవార్డును అనౌన్స్ చేశారు.
Also Read: Dhanush 56: పుర్రెతో ధనుష్ కొత్త సినిమా పోస్టర్.. నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ అదే డైరెక్టర్ తో
అవార్డు అందుకున్న బాలయ్య
అయితే నేడు ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగగా.. నందమూరి బాలయ్య రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. బాలయ్య సాంప్రదాయ పంచెకట్టుతో అవార్డు కార్యక్రమానికి హాజరయ్యారు. సినిమా రంగంలో బాలయ్య చేసిన కృషి, బసవతారకం ఆస్పత్రి ద్వారా ఆయన అందించిన సేవలకు గాను అవార్డు వరించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Nandamuri Balakrishna Receives Prestigious Padma Bhushan from President Droupadi Murmu | TFPC #nandamuribalakrishna #balayya #padmabhushan #padmaawards pic.twitter.com/M63oQSS4Lj
— Telugu Film Producers Council (@tfpcin) April 28, 2025
Also Read: Balakrishna Padma Bhushan: బాలయ్య బాబుకు అభినందనల వెల్లువ.. ఎవరెవరు విష్ చేశారంటే?
పద్మ భూషణ్ అవార్డు పై బాలయ్య రియాక్షన్
ఇది ఇలా ఉంటే.. గతంలో పద్మ భూషణ్ అవార్డు పై స్పందించిన బాలయ్య ప్రభుత్వానికి, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే తనకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. యాభై ఏళ్ళ సుదీర్ఘ సినీ ప్రయాణంలో పాలు పంచుకున్న తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు యావత్ చలనచిత్ర రంగానికి కృతజ్ఞతలు చెప్పారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుంచి ఆయన వారసుడిగా నేటి వరకు వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్న అభిమానులకు, ప్రేక్షకలోకానికి సదా రుణపడి ఉంటానని భావోద్వేగానికి గురయ్యారు.
latest-news | padma bhushan award to balakrishna