Pahalgam Attack: పహల్గాం దాడికి ముందు ఉగ్రవాదులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి సంచలన నిజాలు

ఉగ్రవాదులు పహల్గాం చేరుకునేందుకు దాదాపు 22 గంటల పాటు ట్రెక్కింగ్‌ చేసినట్లు విచారణలో తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నలుగురు ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు పేర్కొన్నాయి. ఇందులో ముగ్గురు విదేశీయులు కాగా.. ఒకరు స్థానిక ఉగ్రవాదని చెప్పాయి.

New Update
Pahalgam Terrorist Attack

Pahalgam Terrorist Attack

పహల్గాం ఉగ్రదాడి ఘటన భారత్‌ను కుదిపేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ ఉగ్రదాడికి సంబంధించి తాజాగా ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పర్యాటకులను చంపేందుకు ఉగ్రవాదులు పెద్ద ప్లానే వేశారు. టెర్రరిస్టులు పహల్గాంలోని బైసరన్‌ను చేరుకునేందుకు దాదాపు 22 గంటల పాటు ట్రెక్కింగ్‌ చేసినట్లు విచారణలో తేలిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.  

Also Read: పాకిస్తాన్‌లో 170 న్యూక్లియర్ బాంబులు.. వాటి రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా..?

Also Read :  నన్ను ఎవరూ ఆనందపరచలేదు.. బ్రేకప్ లిస్ట్ పై శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్!

Terrorists Before Pahalgam Attack

తమ ప్లాన్‌ను అమలుచేసేందుకు ఉగ్రవాదులు కోకెర్నాగ్‌ అడవుల నుంచి బైసరన్‌ లోయ వరకు నడుచుకుంటూ వచ్చారని తెలిసింది. 25 మందికి పైగా పురుషులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు పాల్పడ్డారు.దాడులు చేస్తున్న సమయంలో ఓ స్థానికుడు, పర్యాటకుడి నుంచి రెండు మొబైల్‌ ఫోన్లు కూడా లాక్కున్నట్లు సమాచారం.   

ఈ ఉగ్రదాడిలో నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నారు. వీళ్లలో ముగ్గురు విదేశీయులు, మరొకరు స్థానిక ఉగ్రవాదిగా గుర్తించారు. స్థానిక ఉగ్రవది ఆదిల్ థోకర్‌గా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆదిల్‌ స్వస్థలం అనంత్‌నాగ్‌ జిల్లాలోని బిజ్‌బెహారాకు దగ్గర్లో గురీ అని చిన్న గ్రామం. అతడు టీనేజ్‌లో ఉన్నప్పుడే పలు నిషేదిత ఉగ్ర సంస్థలకు చెందిన వాళ్ల దగ్గర పనిచేశాడు. 2018లో దక్షిణ కశ్మీర్‌లో జరిగిన ఓ ఉగ్రవాది అంతిమయాత్రలో కూడా పాల్గొన్నాడు. ఆ ఏడాదే పాకిస్థాన్ నుంచి స్టూడెంట్ సాధించి వాఘా సరిహద్దు దాటాడు.   

Also read :  Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

పాకిస్థాన్‌కు వెళ్లిన అతడు ఉగ్రవాదిగా తిరిగొచ్చి సొంతగడ్డపైనే కిరాతకానికి పాల్పడ్డాడు. ఇదిలాఉండగా ఇప్పటికే ఈ ఉగ్రదాడిపై భారత భద్రతా బలగాలు, జమ్మూకశ్మీర్‌ పోలీసుల బృందాలు కలిసి సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి. అయితే తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ కేసును ఇప్పుడు జమ్మూకశ్మీర్‌ పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తీసుకుంది. ఈ క్రమంలోనే ఎన్‌ఐఏ బృందాలు పహల్గాంలో దర్యా్ప్తు ప్రారంభించాయి.     

Also Read :  పహల్గాం దాడిని పూర్తిగా షూట్‌ చేసిన వీడియోగ్రాఫర్‌.. కానీ

 telugu-news | rtv-news | Pahalgam attack

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు