/rtv/media/media_files/2025/04/27/0X8i2fYpozn1gBpAlzfy.jpg)
Baisaran Reels Videographer, Who Recorded Entire Pahalgam Attack
పహల్గాం ఉగ్రదాడి వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ దాడికి సంబంధించి ఓ కీలకమైన వీడియో బయటపడింది. బైసరన్‌కు వచ్చే పర్యాటకుల కోసం రీల్స్‌ను చిత్రీకరించే చేసే ఓ స్థానిక వీడియో గ్రాఫర్ ఈ దాడి మొత్తాన్ని తన కెమెరాలో షూట్ చేశాడు. ఈ దాడి జరుగుతున్న సమయంలో అతడు ఓ చెట్టుపై దాక్కొని మరీ దీన్ని షూట్ చేశాడు. ఈ వీడియో ఆధారంగా జరిగిన దారుణాన్ని పూర్తిగా తెలుసుకునేందుకు జాతీయ దర్యాప్తు సంస్థకు ఇది కీలకంగా మారింది.
Also Read: పహల్గాం దాడికి ముందు ఉగ్రవాదులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి సంచలన నిజాలు
Pahalgam Attack Video
ముందుగా ఉగ్రవాదులు రెండు గ్రూపులుగా విడిపోయి లోయలో వేరువేరు దిక్కుల నుంచి తుపాకులతో కాల్పులు జరిపినట్లు అధికారులు గుర్తించారు. ముందుగా ఇద్దరు ఉగ్రవాదులు సందర్శకులను ముస్లిం మతాచారాన్ని పాటించాలని బెదిరింపులకు పాల్పడ్డారు. అనంతరం నలుగురిని కాల్చి చంపేశారు. దీంతో భయంతో సందర్శకులు పారిపోయారు. జిప్‌లైన్ అనే ప్రదేశం నుంచి మరో ఇద్దరు ఉగ్రవాదులు బయటకు వచ్చారు. వాళ్లు కూడా కాల్పులు జరిపారు.
#BreakingNews | Witness Videos Provide Crucial Lead as NIA Begins Probe into Baisaran Terror Attack4o@Arunima24 shares more details@kritsween | #PahalgamTerroristAttack #pahalgamattack pic.twitter.com/Ijk4vPsgOa
— News18 (@CNNnews18) April 27, 2025
Also Read: పాకిస్తాన్‌లో 170 న్యూక్లియర్ బాంబులు.. వాటి రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా..?
Also Read : Ruhani Sharma రెచ్చిపోయిన రుహానీ.. బ్లాక్ అండ్ వైట్‌లో అందాల సెగలు
అయితే అక్కడున్న ఈ వీడియోగ్రాఫర్ తుటాల నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తాడు. ఓ చెట్టు కొమ్మపై దాక్కున్నాడు. ఆ తర్వాత మొత్తం ఈ ఉగ్రదాడిని షూట్ చేశాడు. ఈ విషయాన్ని ఓ సీనియర్ అధికారి చెప్పారు. అలాగే జాతీయ దర్యాప్తు సంస్థ అతడిని ప్రశ్నించి ఆధారాలు సేకరించినట్లు తెలిపారు. ఉగ్రవాదులు, వాళ్లకు సహకరించిన గ్రౌండ్ వర్కర్లను గుర్తించేందుకు ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పారు. ఉగ్రవాదులు దాడి చేసే సమయంలో స్థానికుల నుంచి రెండు ఫోన్లు కూడా లాక్కున్నారు. ఇప్పుడు అధికారులు వాటిని ట్రాక్ చేస్తున్నారు.
Also Read : పాకిస్తాన్‌లో ఈ నగరాలే భారత్ టార్గెట్.. ఇస్లామాబాద్, కరాచీ, రావల్పిడి!
Pahalgam attack | telugu-news | rtv-news