/rtv/media/media_files/2025/09/03/jubilee-hills-by-election-2025-09-03-09-42-18.jpg)
Jubilee Hills by-election
గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad) పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్(by election in jubilee hills 2025) కసరత్తు చేస్తోంది. అక్టోబర్ లో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా పునః సమీక్ష, మార్పులు- చేర్పులు, ఓటింగ్ ప్రక్రియ, పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు తదితర అంశాలపై దృష్టి సారించింది. అక్టోబర్ చివరివారం లేదా నవంబర్ మొదటి వారంలో పోలింగ్ నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. భారత రాష్ట్ర సమితికి చెందిన శాసన సభ్యుడు మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ లో ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో ఆ స్థానాన్ని దక్కించుకోవడానికి మూడు పార్టీలు రంగంలోకి దిగాయి.
Also Read : గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు అమిత్‌షా..నగరంలో హై అలర్ట్..
EC Orders On Jubilee Hills By-Election
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి బీఆర్ఎస్(brs), ఎలాగైనా గెలిచితీరాలన్న లక్ష్యంతో అధికార కాంగ్రెస్ తో పాటు బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. దీంతో నియోజక వర్గంలో రాజకీయ వేడి రాజుకుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఈ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు విడుదల చేసింది. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులపై కసరత్తు పూర్తి చేయడానికి సిద్దమైంది. దీనికి సంబంధించిన తేదీలను ఖరారు చేసింది. పోలింగ్ స్టేషన్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ కిందటి నెల 28వ తేదీన ఆరంభమైంది. త్వరలో దీన్ని పూర్తి చేయనుంది. మంగళవారం ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించింది. కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్ సైట్ లో ఈ ఓటర్ల జాబితా అందుబాటులోకి వచ్చింది. ఈ జాబితాకు సంబంధించి అభ్యంతరాలు, ఫిర్యాదులను ఏవైనా ఉంటే ఈ నెల 17వ తేదీ వరకు స్వీకరిస్తామని తెలిపింది. స్వీకరించిన అభ్యంతరాలు, ఫిర్యాదులను ఈ నెల 25వ తేదీ నాటికి పరిష్కారిస్తామని ఈసీ తెలిపింది.
అన్ని మార్పులు చేర్పుల అనంతరం చివరిగా-తుది ఓటర్ల జాబితాను ఈ నెల 30 న ప్రచురిస్తారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,04,288 మంది పురుషులు కాగా, 1,88,356 మంది మహిళలు. ఇతరుల కేటగిరీలో 25 మంది ఓటర్లు నమోదయ్యారు.ఓటర్లు తమ అభ్యంతరాలను ఈ నెల 17లోపు తెలియజేయాలని సూచించారు. ఓటర్ల జాబితాలో కొత్తగా పేర్లను చేర్చడం లేదా తొలగించడం, సరిదిద్దడం లేదా వేరే నియోజకవర్గానికి మార్చడం వంటి అభ్యంతరాలు ఎవైనా ఉంటే... 6, 7, 8 ఫారాల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అభ్యంతరాలన్నింటినీ ఈ నెల 25లోపు పరిష్కరిస్తామన్నారు. ఓటర్ల తుది జాబితాను ఈ నెల 30న బహిర్గతం చేస్తామని వివరించారు.నియోజకవర్గంలో 407 పోలింగ్ స్టేషన్లు 139 వేర్వేరు భవనాల్లో ఏర్పాటు చేయబడ్డాయి. ఇది పూర్తయిన తర్వాత షెడ్యూల్ వెలువడుతుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నిర్వహించడానికి ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.
ఇది కూడా చూడండి:తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా?