Amit Shah : గణేశ్‌ నిమజ్జన శోభాయాత్రకు అమిత్‌షా..నగరంలో హై అలర్ట్‌..

కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ నేత అమిత్‌షా హైదరాబాద్‌ పర్యటన ఖరారైంది. ఈ నెల 6న ఆయన హైదరాబాద్‌కు రానున్నారు. ఈ మేరకు భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ఆయనను ఈ వేడుకలకు ఆహ్వానించింది.  దీనికి అమిత్‌ షా అంగీకరించారని తెలిసింది.

New Update
ganesh immersion 2025

ganesh immersion 2025

Amit Shah : కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ నేత అమిత్‌షా హైదరాబాద్‌ పర్యటన ఖరారైంది. ఈ నెల 6న ఆయన హైదరాబాద్‌కు రానున్నారు. ఈ మేరకు భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ఆయనను ఈ వేడుకలకు ఆహ్వానించింది.  దీనికి అమిత్‌ షా అంగీకరించారని తెలిసింది. దీంతో అమిత్‌షా నిమజ్జన శోభా యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుని తొలుత ఐటీసీ కాకతీయలో బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. . మధ్యాహ్నం ఒంటి గంటకు చార్మినార్‌ వద్ద వినాయక శోభాయాత్రలో పాల్గొంటారు. మధ్యాహ్నం మూడున్నరకు ఎంజే మార్కెట్‌ వద్ద శోభాయాత్రలో ప్రసంగిస్తారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. కాగా అమిత్‌ షా రాక సందర్భంగా నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

Also Read :   బీఆర్ఎస్ నుంచి కవిత ఔట్.. కొత్త పార్టీకి రిజిస్ట్రేషన్ కంప్లీట్.. పేరు ఇదే!

అయితే చంద్రగ్రహణం కారణంగా నిమజ్జనం కార్యక్రమంపై అనేక  సందేహాలు పుట్టుకొచ్చాయి. ఈక్రమంలోగణేష్ ఉత్సవ కమిటీ దీనికి స్పష్టతనిస్తూ  శనివారం రోజునే నిమజ్జనం చేయాలని ప్రకటన జారీ చేసింది.  కాగా ఈసారి వర్షాల కారణంగా గణేష్‌ ఉత్సవ వేడుకలకు పలు అంతరాయాలు ఏర్పాడుతున్నాయి. గతంలో లాగా కాకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో మండపాల నిర్వహాకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్యాంక్‌బండ్‌ వద్ద రెండో రోజునుంచే నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది.ఈ వినాయక నిమజ్జన వేడుకలు ప్రత్యక్షంగా చూసేందుకు భారీ ఎత్తున జనాలు తరలి వస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయి. నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ ప్రాంతంలో పెద్దసంఖ్యలో క్రేన్లను ఏర్పాటు చేశారు.  

భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ.. పోలీసు అధికారులు ప్రత్యేక సిబ్బందిని మొహరించారు. ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేసారు. రూ. 30 కోట్లతో గణేశ్ నిమజ్జనోత్సవాలు ఏర్పాట్లు చేస్తున్న జీహెచ్ఎంసీ గ్రేటర్ పరిధిలో 74 పాండ్స్ తో పాటు పలు చెరువుల్లో నిమజ్జనాలకు ఏర్పాట్లు చేసారు. వీటిలో 27 పర్మినెంట్ బేబీ పాండ్స్.. 24 టెంపరరీ పోర్టబుల్ పాండ్స్ ఉన్నాయి.  

ఇది కూడా చూడండి:Weather Update: తెలుగు రాష్ట్రాలకు మళ్లీ పొంచి ఉన్న గండం.. వచ్చే నెల నుంచి ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు!

కాగా,ఈసారి శోభాయాత్రలో  అమిత్‌ షా పాల్గొన నుండటంతో శోభాయాత్ర జ‌రిగే మార్గాల్లో పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అయితే, అమిత్ షా పర్యటన రోజున మరిన్ని ఆంక్షలు విధించే అవకాశాలున్నాయి. నగరంలో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ మళ్లింపు పైన పోలీసులు స్పష్టత ఇచ్చారు. మెట్రో అదనపు సర్వీసులు నడపనున్నారు. నిమజ్జనం రోజున అన్ని ప్రభుత్వ .. ప్రయివేటు సంస్థలకు సెలవు ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 


ఇది కూడా చదవండి:ఇన్‌స్టా ప్రియుడికోసం.. కట్టుకున్నోన్ని వదిలేస్తానన్న భార్య... కోపంతో భర్త ఏం చేశాడంటే?

Advertisment
తాజా కథనాలు