/rtv/media/media_files/2025/12/24/a-study-reveals-microplastics-in-air-2025-12-24-16-53-40.jpg)
A study Reveals Microplastics in air
ప్రస్తుత రోజుల్లో గాలి కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతోంది. ముఖ్యంగా నగరాల్లో ఉండేవారు దీనికి తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. గాలిలో కాలుష్య కారకాలే కాకుండా ప్రాణాంత మైక్రోప్లాస్టిక్(microplastics) లు కూడా ఉన్నాయని తాజాగా పరిశోధకులు గుర్తించారు. అవి మన శ్వాస ద్వారా శరీరాల్లోకి వెళ్తున్నట్లు వెల్లడించారు. మైక్రో ప్లాస్టిక్‌లో ఉండే సూక్ష్మజీవులతో ముప్పు పొంచి ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమాటికల్ సైన్స్ (IMSC), ముంబయిలోని హోమీభాభా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ (HBNI), కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER), కల్యాణిలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధ నిర్వహించారు.
Also Read: మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ఢిల్లీ హైకోర్టు.. దానిపై GST తగ్గించాలంటూ ఆగ్రహం
2021-23 మధ్య ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబయి నగరాల్లో గాలి నమూనాలు సేకరించారు. వాటిని పరీక్షంచగా అందులో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్లు గుర్తించారు. పరిశోధకులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో చలికాలం సమయంలో గాలిలో మైక్రోప్లాస్టిక్స్ తీవ్రత ఎక్కువగా ఉంది. క్యూబిక్ మీటర్ గాలిలో 14.18-14.23 మైక్రోగ్రామ్స్‌గా నమోదయ్యింది. జనాభా పెరిగిపోవడం, సింథటిక్ దుస్తులు వాడటం, వ్యర్థాల నిర్వహణ లోపాల వల్ల మైక్రోప్లాస్టిక్స్ గాలిలో కలిసిపోతున్నాయి. వేసవి కాలంతో పోల్చిచూస్తే చలికాలంలో దీని తీవ్రత ఎక్కువగా ఉంది. సముద్రతీర నగరాల్లో వీటి ప్రభావం తక్కువగానే ఉంది.
చెన్నైలో క్యూబిట్ మీటర్ గాలిలో 4 మైక్రో గ్రాములు, ముంబయిలో 2.65 గ్రామాలు ఉంది. ఈ ప్రాంతాల్లో గాలి ప్రసరణ కాస్త మెరుగ్గా ఉండటం, చలి తీవ్రత ఎక్కువగా లేకపోవడం, సింథటిక్ దుస్తులు తక్కువగా వాడటమే దీనికి కారణాలు. ఒక ప్రాంతంలో బయటపడ్డ మైక్రోప్లాస్టిక్స్ గాలిద్వారా దూర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. అంటే ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్, బిహార్, వెస్ట్ బెంగాల్‌కు ఎక్కువగా వెళ్తున్నాయి. బంగ్లాదేశ్, అస్సాంకు పాక్షికంగా వ్యాపిస్తున్నాయి. కోల్‌కతా నుంచి బంగాళఖాతంలోకి.. ముంబయి, చెన్నై నుంచి అరేబియా, హిందూ మహాసముద్రాల వైపు వెళ్తున్నాయి. ఇలా ప్రయాణిస్తున్న మైక్రోప్లాస్టిక్స్ సముద్ర జీవుల ద్వారా కూడా మనిషి ఆహారంలో చేరవచ్చు.
Also Read: ఉస్మాన్ హదీ హత్య వెనుక యూనస్ ప్రభుత్వం !.. బంగ్లాదేశ్‌లో అల్లకల్లోలం
మైక్రోప్లాస్టిక్స్ ఎక్కువగా దుస్తుల్లో నుంచి ఏర్పడతాయి. 11 రకాల పాలిస్టర్ కారకాలను దుస్తులు వెదజల్లుతున్నాయి. మనం పారేసే ప్లాస్టిక్, ప్యాకేజింగ్ వస్తువులు, పెద్ద మార్కెట్లలో అమ్మే పాలిమర్ PVC ప్లాస్టిక్ వస్తువులు, బ్యానర్లు, బొమ్మలు, గృహోపకరణాలు, ఈవేస్ట్, చెత్తను కాల్చడం వల్ల గాలిలో మైక్రోప్లాస్టిక్స్ కలిసిపోతున్నాయి.
మనిషి శరీరంలోకి 2.9 కిలోల ప్లాస్టిక్
గాల్లో పీఎం 10 కాలుష్య కారకాలకు అవి అనుబంధంగా ఉన్నాయి. ప్రయోగశాలల్లో వాయు నమునాలను PYGCMS విధానంలో పరీక్షించారు. నగరాల్లో సగటున క్యూబిక్ మీటర్ గాలిలో 8.8 మైక్రోప్లాస్టిక్స్ బయటపడ్డాయి. దీన్నిబట్టి గమనిస్తే ఒక మనిషి తన జీవిత కాలంలో సగటున 2.9 కిలోల మైక్రోప్లాస్టిక్స్‌ను పీల్చుకునే ప్రమాదం ఉంది. ఆ మైక్రోప్లాస్టిక్స్‌పై పోగయ్యే ప్రమాదకర బ్యాక్టీరియా, ఫంగస్ సహా వివిధ రకాల వైరస్‌లు, సూక్ష్మజీవుల తిత్తులు, నానోపార్టికల్స్ మనుషుల్లో వ్యాధులకు కారణం అవుతాయి.
ఈ మైక్రోప్లాస్టిక్స్.. ఊపిరితిత్తుల కణజాలనికి కూడా హానీ చేయగలవు. అంతేకాదు రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీయగలవు. దీనివల్ల శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా పట్టణ, నగర వాసులు వాడే ప్లాస్టిక్ వస్తువుల సైడ్ ఎఫెక్ట్స్‌పై శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాలని పరిశోధకులు సూచనలు చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సరికొత్త విధానాలు రూపొందించాలని చెబుతున్నారు.
Follow Us