/rtv/media/media_files/2025/04/05/vfXJF2xd5BVmkMrqaTiB.jpg)
Gold Theft
TG Crime : హైదరాబాద్ కాచిగూడలో భారీ దోపిడీ జరిగింది. వృద్ధ దంపతులకు భోజనంలో మత్తుమందు కలిపి దాదాపు 2 కిలోల బంగారు నగలు, రూ.3కోట్ల నగదు, ఖరీదైన కారు ఎత్తుకెళ్లిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. కాచిగూడ లింగంపల్లి అమ్మవారి దేవాలయం సమీపంలో ప్రముఖ పారిశ్రామికవేత్త హేమ్‌రాజ్ , అతడి భార్య మీనా దుగ్గర్ నివాసముంటున్నారు. ఇంట్లో పని మనుషులు వ్యాపారవేత్త హేమరాజు దంపతులకు రాత్రి భోజనంలో మత్తుమందు కలిపి పెట్టారు. అది తిన్న దంపతులిద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో వారు నగలు, నగదు తీసుకుని పారిపోయారు.
ఇది కూడా చూడండి: Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు అంతగా బాగోలేదు..జాగ్రత్తగా ఉంటే బెటర్!
Massive Theft At Businessman's House
కొద్ది రోజుల క్రితం వారు నేపాల్‌కు చెందిన దంపతులను ఇంట్లో పనికి పెట్టుకున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇటీవల వారి కొడుకు, కోడలు విదేశీ యాత్రకు వెళ్లడంతో హేమ్‌రాజ్, అతడి భార్య మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇదే అదనుగా భావించిన పనివారు ఆదివారం రాత్రి భోజనంలో మత్తు మందు కలిపారు. వారు మత్తులోకి వెళ్లగానే ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదుతో పాటు కారు తీసుకుని ఉడాయించారు. ప్రతి రోజూ వాకింగ్‌కు వెళ్లే హేమరాజ్ సోమవారం వాకింగ్‌కు రాకపోవడంతో అతని స్నేహితుడు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది.
Also read: Murder case: కొడుకు అక్రమ సంబంధానికి బలైన తండ్రి.. వాడి పెళ్లం ఫొటోలు వాట్సాప్ స్టేటస్
దీంతో అనుమానం వచ్చిన అతని స్నేహితుడు ఇంటికి వచ్చాడు. ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న హేమరాజు దంపతులను అతను ఆసుపత్రిలో చేర్పించారు. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటి నుంచి బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లిన పని మనుషులు (నేపాలి దంపతులు) కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Also read: wife harassment: మరో భార్యా బాధితుడు బలి.. ‘నా అస్తికలను డ్రైనేజీలో కలపండి’
Also Read : కాంగ్రెస్ కు బిగ్ షాక్...గద్వాల ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
gold | massive-theft | money | drug | theft | gold-theft | business-man | kachiguda | nepali husband wife news