TG Crime : అన్నంలో మత్తు మందు కలిపి... వ్యాపారవేత్త ఇంట్లో భారీ చోరీ
హైదరాబాద్ కాచిగూడలో భారీ దోపిడీ జరిగింది. వృద్ధ దంపతులకు భోజనంలో మత్తుమందు కలిపి దాదాపు 2 కిలోల బంగారు నగలు, రూ.3కోట్ల నగదు, ఖరీదైన కారు ఎత్తుకెళ్లిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఇంట్లో పని మనుషులే ఈ దోపిడీకి పాల్పడ్డారు.