AP : ఆర్టీసీ బస్టాండ్లో భారీ చోరీ.. రూ.11 లక్షల నగదు, 400 గ్రాముల బంగారం అదృశ్యం..!
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఆర్టీసీ బస్టాండ్ లో భారీ చోరీ జరిగింది. రూ.11 లక్షల నగదు, 400 గ్రాముల బంగారం బ్యాగ్ అదృశ్యం అయింది. బస్సులో సీటు కోసం కిటికీలోంచి బ్యాగ్ వేసిన గుంటూరుకు చెందిన బంగారు వ్యాపారి..బస్సు ఎక్కి చూసేసరికి బ్యాగ్ కనిపించలేదంటూ వాపోయారు.