/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-01T094512.156.jpg)
Horoscope
Horoscope Today
మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి పరమైన ఒత్తిళ్లు కొనసాగుతాయి. ఆశించిన ఫలితాలు ఆలస్యం కావచ్చు. కీలక వ్యవహారాల్లో శ్రద్ధ పెంచాలి. చేపట్టిన పనుల్లో దూకుడు తగ్గించి సహనం, ఓర్పుతో మెలగాలి.
Also Read: Holiday Culture: హాలీడే కల్చర్ తో ఉత్పాదకత తగ్గిపోతుందన్న సీఈవో..మండిపడుతున్న నెటిజన్లు!
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉత్సాహంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు. మనోధైర్యంతో కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకోడానికి ఈ రోజు ఓ మంచి రోజు.
మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. భాగస్వామ్య వ్యాపారాలలో కొంత అనిశ్చితి నెలకొంటుంది. అనారోగ్య సమస్యలతో కొంత అశాంతిగా ఉంటారు.
కర్కాటకరాశి వారికి ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఈ రోజంతా సరదాగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాలలో శుభ ఫలితాలు ఉంటాయి. విదేశాల నుంచి సన్నిహితుల రాక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సిద్ధిస్తుంది.
సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు పని ప్రదేశంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధికారుల చొరవతో సమస్యలు పరిష్కారమవుతాయి. కీలక విషయాల్లో ఆచి తూచి వ్యవహరించాలి. లక్ష్యాలు సాధించేవరకు నిర్విరామంగా శ్రమించాల్సి ఉంటుంది. ఆర్థిక వృద్ధి ఉంది. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది.
Also Read: KKR vs GT: చేతులెత్తేసిన కేకేఆర్.. గుజరాత్ ఖాతాలో మరో ఘన విజయం
కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు వుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహా మేరకు నడుచుకుంటే బెటర్. కోపతాపాలు అదుపులో ఉంచుకోవాలి. పెద్దలతో వినయంగా నడుచుకోవాలి. చెడు విషయాల మీద మనసు పోకుండా జాగ్రత్త వహించండి. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. ఖర్చులు పెరుగుతాయి.
తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం, ఆర్థికలాభాలు ఉంటాయి. కోపం అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే కుటుంబ సభ్యులతో కలహాలు తప్పవు. వ్యాపారంలో ఆశించిన లాభాలు ఉంటాయి.
వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో అనుకున్న ఫలితాలు దక్కించుకుంటారు. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ఇది తగిన సమయం. నిరంతర కృషితో మీ బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తారు. దైవబలం అండగా ఉంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటుంది.
ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో శారీరక శ్రమ పెరుగుతుంది. ఒత్తిడి దరిచేరకుండా జాగ్రత్త పడండి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయడంపై దృష్టి సారించండి. అనుకోని రీతిలో వ్యాపారంలో నష్టాలు వస్తాయి.
మకరరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. దైవబలంతో చేపట్టిన ప్రతి పనిలోనూ సానుకూలత ఉంటుంది. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశం ఉంది. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. క్రమశిక్షణ, సమయపాలనతో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఎంత గొప్పగా పనిచేస్తే అంత విజయం లభిస్తుంది.
మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగుల మీద తీవ్రమైన ఒత్తిడి ఉండవచ్చు. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురవుతాయి. బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలు దూరమవుతాయి.
Also Raed: శవం ముందు పెళ్లి డ్యాన్సులు.. డీజే పాటలకు చిందేసిన ఆడ, మగ - వీడియో చూశారా?
horoscope | horoscope-today | todays-horoscope | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates