wife harassment: మరో భార్యా బాధితుడు బలి.. ‘నా అస్తికలను డ్రైనేజీలో కలపండి’

భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక మోహిత్ యాదవ్ సెల్ఫీ వీడియో తీసి సూసైడ్ చేసుకున్నాడు. వరకట్న వేధింపులు కేసు పెడతామని బెదిరిస్తున్నారని వీడియోలు చెప్పాడు. తన చావుకు న్యాయం జరగకుంటే అస్తికలు డ్రైనేజీలో కలపాలని బందువులను కోరాడు.

New Update
Mohith Yadav

బెంగళూరుకు చెందిన టెక్కీ అతుల్ సుభాష్ సూసైడ్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. 24 పేజీల సూసైడ్ లెటర్ రాసి.. తనకు భార్య, అత్తమామల నుంచి ఎదురైన వేధింపులను వీడియోలో చెప్పుకొని చనిపోయాడు. అలాంటి ఘటనే తాజాగా మరొటి చోటుచేసుకుంది. తన భార్య, ఆమె కుటుంబం తనను మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తోందని ఆరోపిస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు న్యాయం జరగకపోతే అస్తికలు డ్రైనేజీలో కలుపాలని చెబుతూ ఒక సెల్ఫీ వీడియో తీసి దగ్గరి బంధువుకు షేర్‌ చేశాడు. అందులో తన చావుకు న్యాయం జరగకపోతే అతని అస్తికలు మురికి కాలువలో కలపాలని చెప్పుకొచ్చాడు.

Also read: Husband: బ్యూటీపార్లర్‌కు భార్య, పాపిష్టి మొగుడు.. పాపం బోడిగుండు భార్య

Also read: బిట్టూ నువ్ సూపర్ రా..  క్రికెట్‌పై ఇష్టం రూ.3900 కోట్ల ఆస్తిని కాపాడింది..!

మోహిత్‌ యాదవ్ అనే వ్యక్తి సిమెంట్‌ కంపెనీలో ఫీల్డ్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ప్రియ అనే యువతిని ఏడేళ్లుగా ప్రేమించాడు. పెద్దలను ఒప్పించి రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. దంపతుల మధ్య గొడవలు తలెత్తాయి. భార్య కుటుంబసభ్యులు తనను వేధింపులకు గురిచేస్తోందని, బెదిరిస్తున్నారని మోహిత్‌ ఒక వీడియో రికార్డు చేశాడు. ఆ వీడియోను దగ్గరి బంధువుకు షేర్‌ చేసి ఒక హోటల్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Also read: బీజేపీ లీడర్ హత్యకు కుట్ర.. రెడ్‌హ్యాడెండ్‌గా దొరికిపోయిన సుపారీ గ్యాంగ్

వరకట్న వేధింపుల కేసు పెడతామని బెదిరిస్తూ..

మోహిత్ రికార్డ్ చేసిన వీడియోలో ఇలా చెప్పుకొచ్చాడు.అతని భార్య ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా ఉద్యోగంలో చేరింది. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న ఆమెకు వాళ్ల అమ్మ అబార్షన్‌ చేయించింది. ఆమెపై ఉన్న బంగారు ఆభరణాలను బలవంతంగా దగ్గర పెట్టుకుంది. ఒక రూపాయి కట్నం కూడా తీసుకోలేదు. కానీ నాపై తప్పుడు కేసులు పెట్టారు. నాకు నా తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తులను తన పేరిట బదిలీ చేయాలని నా భార్య కూడా తరచూ గొడవలు పెట్టుకునేది. ఈ విషయంపై ఆమె, ఆమె కుటుంబసభ్యులు నన్ను మానసికంగా చిత్రహింసలకు గురిచేశారు. వారు చెప్పినట్లు చేయకపోతే నా కుటుంబసభ్యులపై కూడా కేసులు పెడతామని బెదిరించారు’ అని మోహిత్‌ ఆ వీడియోలో చెప్పాడు.

(Atul Subhash | Atul Subhash Case | wife harassment | Husband suicide | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు