/rtv/media/media_files/2025/07/06/good-news-for-women-2025-07-06-09-58-25.jpg)
Good news for women
Telangana: తెలంగాణ మహిళామణులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని 65 లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు చీరలు పంపిణీ చేయాలని సంకల్పించింది. ఒక్కొక్కరికి రెండు చీరల చొప్పున పంపిణీ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీనికి అవసరమైన చీరలను సిరిసిల్లలో పవర్ లూం మీద తయారు చేయిస్తున్నది.
Also Read: పోలీసులనే మోసం చేసిన యువతి.. యూనిఫాంలో ట్రైనింగ్ చేస్తూ
Sarees Distributed On Vijayadashami
రాష్ట్రంలో ఉన్న 65 లక్షల మందికి రెండు చొప్పున 1.30 కోట్ల చీరలు అవసరం కానున్నాయి. దీనికోసం 4 కోట్ల మీటర్ల చీరలు అవసరం పడతాయని అధికార్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కోటి మీటర్ల చీరలు తయారై ప్రాసెసింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన వాటి తయారీ కొనసాగుతోంది. సిరిసిల్లలో రోజు 5 వేల మంది పవర్‌లూం కార్మికులు చీరలు నేసే కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు.
Also Read: ట్రంప్‌కు ఝలక్ ఇచ్చిన ఎలాన్‌మస్క్..కొత్త పార్టీ ప్రారంభం
గత ప్రభుత్వం ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మ చీరల పేరుతో మహిళలకు చీరలు పంపిణీ చేసేది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. అయితే డ్వాక్రా మహిళలకు మాత్రం చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. వీటిని సెప్టెంబర్చివరి కల్లా రెడీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అప్పటి కల్లా తయారీ ప్రక్రియ పూర్తి చేయాలని అధికార్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటి తయారీ కోసం బీసీ సంక్షేమ శాఖ ఇప్పటికే రూ.318 కోట్లు విడుదల చేసింది. చీరల డిజైన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఖరారు చేశారు. ఈ సారి వీలయినంత వరకు దసరాకు.. పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ అలా కుదరకుంటే మరో తేదీలో చీరలను పంపిణీ చేయనున్నారు.
ఇది కూడా చూడండి:Unwanted Hair: ముఖంపై అవాంచిత రోమాలా! లేజర్ చికిత్స సురక్షితమేనా?
Also Read : శ్రీశైలానికి పోటెత్తిన వరద నీరు..ప్రమాదంలో ఆనకట్ట ?
saree | Women Self Help Societies | siricilla latest news | siricilla