Assistant professors: గుడ్ న్యూస్.. ఓయూలో 250, కాకతీయలో 145 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు
రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మరో అడుగు పడింది. వాటి నియామకాలకు నాలుగు వర్సిటీల పాలకమండళ్లు తాజాగా ఆమోదం తెలిపాయి. కాకతీయ వర్సిటీలో 145, శాతవాహనలో 3, ఓయూలో 250, పాలమూరులో 8 పోస్టుల భర్తీకి ఆమోదం లభించింది.