/rtv/media/media_files/2025/07/10/telangana-2025-07-10-13-35-55.jpg)
Telangana
ఏపీ మంత్రి నారా లోకేష్‌కి పి.వి.ఎన్.మాధవ్ ఇటీవల భారత చిత్ర పటాన్ని బహుమతిగా ఇచ్చారు. ఇందులో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా లేకుండా ఇవ్వడంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్ మండిపడ్డారు. ఏపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర గుర్తింపును చిత్రపటంలో తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిచారు. ఈ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూపించకుండా ఉమ్మడి ఏపీగా చూపించడంతో.. తెలంగాణ గుర్తింపుపై ఏపీ నేతలు చేస్తున్న కుట్ర అని శ్రవణ్ సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేశారు.
ఇది కూడా చూడండి: Deputy CM Pawan Kalyan: బ్యాటరీ సైకిల్ నడిపిన పవన్ కల్యాణ్..బాలుడికి లక్షప్రోత్సాహకం
తెలంగాణను గుర్తించకుండా..
దశాబ్దాల ప్రజాస్వామ్య పోరాటం, చారిత్రక త్యాగాలు, రాజ్యాంగ ప్రక్రియ ద్వారా ఆవిర్భవించిన భారతదేశ 29వ రాష్ట్రమైన తెలంగాణను పటంలో నుంచి తొలగించి, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లను స్పష్టంగా గుర్తించడం దిగ్భ్రాంతికరమని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ సీనియర్ నాయకులు ఇలా తెలంగాణను గుర్తించకపోవడం కేవలం అజ్ఞానాన్ని మాత్రమే కాదు. అహంకారం, ధిక్కారం, ఉద్దేశపూర్వక నిరాకరణ, తెలంగాణ ఉనికిని, అస్తిత్వాన్ని అక్రమంగా చూపించడానికి చేసిన రాజకీయ కుట్రను వెల్లడించారు.
The India map displayed by Andhra leaders Shri @naralokesh and Shri @MadhavBJP, deliberately omitting Telangana, is a dangerous and deeply offensive act that strikes at the very heart of our identity.
— Prof Dasoju Sravan Kumar (@sravandasoju) July 10, 2025
It is shocking that while Jharkhand and Chhattisgarh are clearly acknowledged… https://t.co/Bgc6xKBwoRpic.twitter.com/Mo7qRZZGGJ
ఇది కూడా చూడండి:Amit Shah: రిటైర్మెంట్ తర్వాత నేను చేసేది అదే.. అమిత్ షా కీలక ప్రకటన
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ప్రతి తెలంగాణ వాసి ఆత్మపై ఇది ఒక క్రూరమైన దాడి. తెలంగాణ అస్తిత్వం, వారసత్వం, చట్టబద్ధతను ప్రతీకాత్మకంగా నాశనం చేశారు. ఒక వైపు వారు మన గోదావరి, కృష్ణా జలాలను దోచుకుంటున్నారు. ఇప్పుడు, తెలంగాణ ఉనికిని చెరిపేసిన భారతదేశ పటాన్ని చూపించి మనల్ని అవమానిస్తున్నారు.అందువల్ల ఈ తీవ్రమైన చర్యను తక్షణమే సుమోటోగా స్వీకరించి భారతీయ న్యాయ సంహితలోని నిబంధనల ప్రకారం కేసు నమోదు చేయాలని తెలంగాణ డీజీపీకి విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చూడండి:Population Crisis : కడుపు తెచ్చుకో..రూ.లక్ష అందుకో..స్కూల్, కాలేజ్ విద్యార్థులకు సంచలన ఆఫర్..ఎక్కడంటే?
సెక్షన్ 336 పబ్లిక్ డాక్యుమెంట్ల ఫోర్జరీ, సెక్షన్ 337 మోసం చేయు ఉద్దేశ్యంతో ఫోర్జరీ, సెక్షన్ 196 ప్రకారం ప్రాంతాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, సెక్షన్ 352 తెలంగాణ రాజకీయ, సాంస్కృతిక అస్తిత్వాన్ని క్రిమినల్ బెదిరింపు, సెక్షన్ 353 శాంతికి భంగం కలిగించే, అశాంతిని రేకెత్తించే అవకాశం ఉన్న పబ్లిక్ దుష్ప్రవర్తన కింద కేసు నమోదు చేయాలన్నారు. ఇది కేవలం ఒక మ్యాప్ గురించే కాదు.. మన పోరాటం, మన త్యాగాలు, మన చరిత్ర, మన అస్తిత్వం, అన్నిటికీ మించి మన రాజ్యాంగ హక్కుల గురించి అని తెలిపారు.
ఇది కూడా చూడండి:Youtube: యూట్యూబర్లకు షాక్.. ఇకనుంచి ఆ వీడియోలకు డబ్బులు రావు