/rtv/media/media_files/2025/08/23/congress-pac-meeting-today-to-finalise-local-body-poll-dates-2025-08-23-11-46-42.jpg)
Congress PAC meeting today to finalise Local body poll dates
Telangana Elections:
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై చర్చించేందుకు శనివారం సాయంత్రం 5 గంటలకు గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) భేటీ కానుంది. అలాగే సోమవారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంతో పాటు.. కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై, అలాగే అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వంటి వాటిపై కూడా చర్చలు జరపనున్నారు.
Also Read: భారత్‌లోకి మళ్లీ టిక్‌టాక్ సేవలు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
స్థానిక ఎన్నికల ఎప్పుడు నిర్వహించాలనే తేదీల విషయంలో మంత్రులు, బీసీ నేతలు ఇప్పటికే వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే శనివారం జరగనున్న పీఏసీ సమావేశంలో దీనిగురించి చర్చించాలని సీఎం రేవంత్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్ నేత అభిప్రాయాలు కూడా సేకరించిన తర్వాత ఎన్నికల తేదీపై క్లారిటీ రానుంది. దీనిపై కేబినెట్ మీటింగ్‌లో కూడా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే మంత్రుల్లో చాలామంది స్థానిక సంస్థల ఎన్నికలు త్వరగా నిర్వహించడం మంచిదని చెబుతున్నారు. మరోవైపు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తేలాక ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్‌కు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు.
Also Read: ధర్మస్థల కేసులో సంచలన అప్‌డేట్.. ముసుగు వ్యక్తి అరెస్టు
రాష్ట్రంలో బీసీలకు పార్టీపరంగానే రిజర్వేషన్లు కల్పించే అంశంపై పీఏసీ మీటింగ్‌లో చర్చిస్తారని తెలుస్తోంది. ఒకవేళ దీన్ని అమలు చేయాల్సి వస్తే జిల్లాల వారీగా నాయకుల అభిప్రాయాన్ని కూడా తెలుసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే హైకోర్టు సెప్టెంబర్ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించిన సంగతి తెలసిందే. ఆ గడువులోపే నిర్వహించడం మంచిదని అధికార వర్గాలు సూచిస్తున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతపై బీఆర్‌ఎస్, బీజేపీ.. కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నాయి. ఈ అంశంపై కూడా పీఏసీ మీటింగ్‌లో చర్చించనున్నారు. అలాగే గ్రామీణ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో పార్టీ కమిటీల నియామకాలు, ఖాళీగా ఉన్నటువంటి నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు జిల్లాల వారీగా వచ్చిన ప్రతిపాదనలపై చర్చించనున్నారు. అలాగే త్వరలో జరగబోయే జూబ్లిహిల్స్ ఉపఎన్నికపై పాటించాల్సిన వ్యూహంపై కూడా మాట్లాడనున్నారు.
Also Read: అమెరికాకు తగ్గిన వలసదారుల సంఖ్య.. 1960ల తర్వాత ఇదే మొదటిసారి..
మరోవైపు ఇటీవల రాహుల్‌గాంధీ ఓటుచోరీపై చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా ఉద్యమం చేయాలని కూడా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే తెలంగాణలో కూడా పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. వీటిని ఎలా నిర్వహించాలనే దానిపై కూడా పీఏసీ మీటింగ్‌లో చర్చించనున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ శ్రేణులను అలెర్ట్ చేయాల్సిన దానిపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Also Read: స్నేహితుడు సినిమా రిపీట్.. వైద్యుడి వీడియో కాల్‌తో ఇంట్లోనే భార్యకు ప్రసవం చేసిన భర్త