/rtv/media/media_files/2025/08/23/masked-man-bhima-arrested-by-sit-2025-08-23-10-06-16.jpg)
Masked man Bhima arrested by SIT
Dharmasthala Case:
ధర్మస్థల కేసు వ్యవహారంలో మరో బిగ్ ట్విస్ట్ నెలకొంది. తప్పుడు సమాచారంతో ప్రభుత్వాన్ని, ప్రజలను తప్పుదారి పట్టించాడని ముసుగు వ్యక్తి భీమాను సిట్ అధికారులు అరెస్టు చేశారు. ధర్మస్థలకు చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేశాడనే అభియోగంతో అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ధర్మస్థల వ్యవహారం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతంలో వందలాది మంది మృతదేహాలను తాను పూడ్చిపెట్టానని మాజీ పారిశుద్ధ్య కార్మికుడు భీమా ఆరోపణలు చేశారు. అందులో ఎక్కువగా అత్యాచారం, హత్యలకు గురైన మహిళలవే ఉన్నట్లు తెలిపాడు. దీంతో రంగంలోకి దిగిన సిట్ అధికారులు తవ్వకాలు ప్రారంభించారు. కానీ మృతదేహాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు.
అయితే శుక్రవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు సిట్ ప్రధాన అధికారి అయిన ప్రణబ్ మహంతి.. భీమాను విచారించారు. అతడు మాయమాటల చెప్పి వ్యవస్థను నమ్మించి చివరికి ఏమీ తెలియదని అంటున్నాడని సిట్ విచారణలో గుర్తించారు. ఈ క్రమంలోనే అధికారులు భీమాను అరెస్టు చేశారు. శనివారం అతడిని కోర్టులో హాజరుపర్చనున్నారు. అంతకు ముందు కూడా భీమా ఈ కేసు విషయంలో మాట మార్చాడు. తనకు ఒకరు పుర్రె ఇచ్చి సిట్ అధికారులకు ఇవ్వాలని చెప్పారని.. కోర్టులో అర్జీ కూడా వారే చేయించారని పేర్కొన్నాడు. 2014 నుంచి తాను తమిళనాడులోనే ఉంటున్నానని చెప్పాడు. దీంతో ధర్మస్థల వ్యవహారం మలుపు తిరిగింది.
Also Read: భారత్‌లోకి మళ్లీ టిక్‌టాక్ సేవలు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
అలాగే సుజాత భట్ అనే ఓ మహిళ కూడా తాజాగా మరో కీలక విషయాన్ని చెప్పారు. ధర్మస్థలకు వెళ్లిన తన కూతురు మిస్ అయిందని గతంలో తాను చెప్పినవన్నీ కట్టుకథలే అని పేర్కొన్నారు. ఇంతకుముందు ఆమె పోలీసులకు తన కూతురు అనన్య భట్ కనిపించకుండా పోయినట్లు ఫిర్యాదు చేశారు. 2003లో తన కూతురు స్నేహితులతో కలిసి ధర్మస్థలకు వెళ్లి రాలేదని చెప్పారు. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లు పట్టించుకోలేదని తనను బెదిరించి పంపించినట్లు వాపోయారు. దీంతో పోలీసులు దీనిపై కూడా దర్యాప్తు చేపట్టారు.
ఈ నేపథ్యంలోనే ఆమె శుక్రవారం మరో ట్విస్ట్ ఇచ్చారు. తన కూతురు మిస్ అయినట్లు చెప్పిందంతా కట్టు కథేనని ఓ యూట్యూబ్ ఛాన్‌ల్‌తో మాట్లాడుతూ చెప్పారు. తనకు అసలు అనన్య భట్ పేరుతో కూతురే లేదని.. ధర్మస్థల కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు ప్రముఖ వ్యక్తులు నాతో అలా చెప్పించినట్లు పేర్కొన్నారు. అంతేకాదు అనన్య మిస్ అయినట్లు వచ్చిన ఫొటోలు కూడా సృష్టించినవేనని తెలిపారు.
Also Read: స్నేహితుడు సినిమా రిపీట్.. వైద్యుడి వీడియో కాల్‌తో ఇంట్లోనే భార్యకు ప్రసవం చేసిన భర్త
ఇలా పోలీసులకు కట్టుకథ చెప్పినందుకు తాను ఎవరిదగ్గరి నుంచి కూడా డబ్బులు తీసుకోలేదన్నారు. మా తాతకు చెందిన కొంత భూమిని ధర్మస్థల ఆలయ అధికారులు తీసుకున్నారని.. మా పర్మిషన్, సంతకాలు లేకుండానే దాన్ని లాక్కున్నారని ఆరోపించారు. ఆ ఆస్తి విషయం తేల్చుకునేందుకు వాళ్లు చెప్పింది చేశానని సుజాత భట్ స్పష్టం చేశారు. ఆ తర్వాత తాను పెద్ద తప్పు చేసినట్లు అర్థమైందని అందుకే ఇప్పుడు బయటకు వచ్చి నిజం చెప్పానని పేర్కొన్నారు.