USA: అమెరికాకు తగ్గిన వలసదారుల సంఖ్య.. 1960ల తర్వాత ఇదే మొదటిసారి..

ఈ ఏడాది జనవరి  నుంచి జూన్ లోపల అమెరికాలో వలసదారుల సంఖ్య విపరీతంగా తగ్గింది. దాదాపు 1.5 మిలియన్లు తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇలా తగ్గడం 1960 తర్వాత ఇదే మొదటిసారని అంటున్నారు. 

New Update
Trump

Trump

USA: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు ఆ దేశానికి వచ్చే వలసదారుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఈ సంఖ్య దాదాపు 1.5 మిలియన్లకు చేరుకుంది. ఇంత భారీగా వలసదారులు ఆగిపోవడం 1960 తర్వాత ఇదే మొదటిసారని నివేదికలు చెబుతున్నాయి. దీనికి కారణం ట్రంప్ అనుసరిస్తున్న కఠిన విధానాలే అని చెబుతున్నారు. సామూహిక బహిష్కరణలు, అరెస్ట్ లు, అమెరికాలో ప్రవేశించేందుకు రూల్స్ ను కఠినతరం చేయడం లాంటి వాటి వల్ల వలసలు బాగా తగ్గిపోయాయి. ఈ ఏడాది ప్రారంభంలో 53.3 మిలియన్లుగా ఉండే వలసలు తర్వాత 51.9 మిలియన్లకు పడిపోయింది. ప్యూ రిసెర్చ్ సెంటర్ ఈ నివేదికను విడుదల చేసింది. 

ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం..

 వలసదారులు తగ్గిపోవడం వలన అమెరికాకు తీవ్ర నష్టం కలుగనుందని ప్యూ రీసెర్చ్ సెంటర్ సీనియర్ డెమోగ్రాఫర్ జెఫ్రీ పాసెల్ చెబుతున్నారు. దీని వలన అగ్రరాజ్యం 7, 50 వేలకు పైగా శ్రామికులను కోల్పోయిందని తెలిపారు. ఒకవైపు ఇక్కడ యువకుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఉన్న జనాభాలో ఎక్కువ వయసు పైబడిన వారే ఉన్నారు. దీని కారణంగా శ్రమ శక్తి పెరగడం లేదు. ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థనే నాశనం చేస్తుందని జెఫ్రీ చెబుతున్నారు. బైడెన్ పరిపాలనలోనే వలసదారులు తగ్గడం ప్రారంభం అయింది..ట్రంప్ వచ్చాక ఆయన పెట్టిన ఆంక్షలతో అది మరింత ఎక్కువైందని చెప్పారు. అయితే ఇమ్మిగ్రెంట్స్ విషయంలో ఇంకా అమెరికాను అగ్రస్థానంలో ఉందని అన్నారు. కెనడా, యూఏఈలతో పోలిస్తే ఇక్కడకే ఎక్కువ మంది వలసదారులు వస్తున్నారని అన్నారు. మరోవైపు ఈ వలసదారులు వచ్చే మార్గం కూడా మారింది. ఇప్పుడు మెక్సికో నుంచి కాక దక్షిణ అమెరికా నుంచి ఎక్కువగా వస్తున్నారని తెలిపారు. 

Also Read: Uttarakhand Cloud Burst: మళ్ళీ ఉత్తరాఖండ్ లో మెరుపు వరదలు..పలువురు గల్లంతు

Advertisment
తాజా కథనాలు