/rtv/media/media_files/kkDmvjJWiXh9xBz1UnYS.jpg)
KTR
తెలంగాణలో దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యమేలుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(brs-working-president-ktr) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల్లో అక్రమంగా నిర్మించుకున్నారని ప్రభుత్వం తొలగించిన ఇండ్లను కేటీఆర్ పరిశీలించారు. పేదలు ఎంతో కష్టపడి కట్టుకున్నఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చివేస్తున్నదని ఆయన ఆరోపించారు. రేవంత్ సర్కార్ కనికరం లేకుండా ఖమ్మం అర్బన్ వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదల ఇళ్లను నేలమట్టం చేస్తోందన్నారు. ఈ క్రమంలో వారికి అండగా నిలిచేందుకు కేటీఆర్ ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులను కలిశారు.
Also Read : ఫాల్కన్ గ్రూప్ మాజీ సీఓఓ వికాస్ కుమార్ సఖారే అరెస్ట్
KTR About Congress Government
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 16వ తేదీ నుంచి అసెంబ్లీ ప్రారంభమవుతుందని.. ఖమ్మం ప్రజల సమస్యను శాసనసభలో ప్రస్తావిస్తామని కేటీఆర్ అన్నారు. మీ అందరికీ న్యాయం జరిగే వరకూ మీ పక్షాన ప్రభుత్వంపై పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. మిమ్మల్ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(minister-ponguleti), తుమ్మల నాగేశ్వర్ రావు(minister-thummala-nageswara-rao), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుస్తరు. మీకు అది చేస్తం.. ఇది చేస్తం.. అని మీ 900 కుటుంబాల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారన్నారు. మీరు ఐక్యంగా ఉంటేనే విజయం సాధిస్తరు.. లేదంటే వీళ్లు ఒక 100 మందితో వేలి ముద్రలు తీసుకొని మీకు ఎంతో కొంత ఇస్తరు అని కేటీఆర్ అన్నారు. అలాగే కేసీఆర్ 2000 డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించారు. వాటిలో కొన్ని మిగులున్నయట. ఆ ఇండ్లలో కొంతమందికిస్తమని చెప్పి వారిని లాక్కెళతారని కేటీఆర్ హెచ్చరించారు.
హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు ఎక్కడ చూసినా కూల్చివేతలేనని ఆరోపించారు. ఖమ్మంలో కూల్చివేసిన కాలనీ చూశానని.. ముగ్గురు మంత్రులకు 60 ఎకరాల మీద కన్నుబడిందని ఆక్షేపించారు. ముగ్గురు మంత్రులు కలిసికట్టుగా ఈ దుర్మార్గం చేశారని విమర్శించారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరికీ తాము అన్యాయం చేయలేదని కేటీఆర్ గుర్తు చేశారు. అందరూ ధైర్యంగా ఉండాలని.. మీ అందరికీ అదే ప్రాంతంలో, అక్కడే ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇస్తామని మాటిచ్చారు. ఇక్కడ అన్యాయం జరిగిన వారందరికీ అండగా నిలబడాలని తాను ఇక్కడకు వచ్చానని చెప్పుకొచ్చారు. ఇళ్ల కూల్చివేతపై కోర్టుకి కూడా వెళ్దామని.. మీకెవరికీ ఒక రూపాయి ఖర్చు లేకుండా మీ తరఫున తమ లీగల్ టీం పోరాడుతుందని మాజీమంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
Also Read : ఒకే జిల్లాకు కలెక్టర్ గా భార్య,ఎస్పీగా భర్త!
Follow Us