Municipal elections : మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జోరు..84 హస్తం హవా..బీఆర్‌ఎస్‌ ఖాతాలోకి 26..తొలివెలుగు సంచలన సర్వే

మన్సిపోల్స్‌ పోరులో అధికార పార్టీ మెజారిటీ మున్సిపాలిటీలు కైవసం చేసుకోనుంది. తొలివెలుగు సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. మొత్తం 116 మున్సిపాలిటీల్లో హస్తం పార్టీ ఏకంగా 84 గెలుచుకోనుంది. బీఆర్‌ఎస్‌ 26, బీజేపీ 5, ఎంఐఎం 1 పురపాలికపై జెండా ఎగురవేయనున్నాయి.

New Update
FotoJet (10)

Municipal elections

Municipal elections : మన్సిపోల్స్‌ పోరులో కాంగ్రెస్‌ సత్తా చాటనుంది. అధికార పార్టీ మెజారిటీ మున్సిపాలిటీలు కైవసం చేసుకోనుంది. తొలివెలుగు సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి.  ఎన్నికలు జరుగుతున్న మొత్తం 116 మున్సిపాలిటీల్లో హస్తం పార్టీ ఏకంగా 84 గెలుచుకోనుంది. ఇక ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ 26, బీజేపీ 5, ఎంఐఎం ఒక్క పురపాలికపై జెండా ఎగురవేయనున్నాయి. జిల్లాల వారిగా చూస్తే ఒక్క మెదక్‌ జిల్లా తప్ప మిగిలిన 9 ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్‌ జోరు కొనసాగనుంది. మెదక్‌లో బీఆర్‌ఎస్‌ అత్యధిక మున్సిపాలిటీలు గెలిచి సత్తా చాటనుంది. ఖమ్మం, నల్గొండలో కాంగ్రెస్‌ క్వీన్‌స్వీప్‌ చేయనుంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా-లో 13 మున్సిపాలిటీల్లో  కాంగ్రెస్ -10 , బీఆర్ఎస్-02, బీజేపీ-01 గెలవనున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అధికార పార్టీ హవా నడవనుంది. ఇక్కడ మొత్తం 7 మున్సిపాలిటీల్లో  కాంగ్రెస్ -06, బీఆర్ఎస్-01 గెలుచుకోనున్నాయి. -ఉమ్మడి ఆదిలాబాద్‌లో  -10 మున్సిపాలిటీలుండగా కాంగ్రెస్ -06, బీఆర్ఎస్-03, ఎంఐఎం 1 తమ ఖాతాలో వేసుకోనున్నాయి. ఉమ్మడి నల్గొండలోని మొత్తం 17 మున్సిపాలిటీల్లో  కాంగ్రెస్ - 17 గెలుచుకొని క్లీన్‌స్వీప్‌ చేయనుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా -18 పురపాలికల్లో కాంగ్రెస్-11, బీజేపీ-04, బీఆర్ఎస్-03 గెలవనున్నాయి. ---ఉమ్మడి ఖమ్మం జిల్లా - 07 మున్సిపాలిటీల్లో మొత్తానికి మొత్తం కాంగ్రెస్‌ తన ఖాతాలో వేసుకోనుంది. ఉమ్మడి వరంగల్ - 12 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్- 08, బీఆర్ఎస్-04 గెలవనున్నాయి.ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 పురపాలికల్లో బీఆర్ఎస్-11, కాంగ్రెస్-08 గెలుచుకోనున్నాయి. ఈ జిల్లాలో మాత్రం కారుపార్టీ దూసుకుపోనుంది. రంగారెడ్డి -జిల్లాలోని13 పురపాలికల్లో కాంగ్రెస్- 11, బీఆర్ఎస్-02 గెలుచుకోనున్నాయి. 

ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ కే మెజార్టీ

ఉమ్మడి ఆదిలాబాద్ లో 10 మున్సిపాల్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ -06, బీఆర్ఎస్-03, ఎంఐఎం -01 మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోనున్నాయి. అందులో 1.ఆదిలాబాద్‌ కు సంబంధించి 49 స్థానాల్లో కాంగ్రెస్ 15-16, బీఆర్ఎస్‌ 09-11, బీజేపీ 10-12, ఎంఐఎం 04-05, ఇతరులు 03-05 గెలిచే ఛాన్స్ ఉన్నది. 2. భైంసాలో 26 స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ 1-4, బీఆర్ఎస్‌ 0-3, బీజేపీ 2-3, ఎంఐఎం 12-14, ఇతరులు 01-02 విజయం సాధించే ఛాన్స్ ఉన్నది. 3. ఖానాపూర్‌ లో 12 స్థానాల్లో కాంగ్రెస్ 03-04, బీఆర్ఎస్‌ 3-4, బీజేపీ -3-4 స్థానాలు రానున్నాయి. 4. నిర్మల్‌ లో 42కు గాను కాంగ్రెస్ 13-15, బీఆర్ఎస్ 04-05, బీజేపీ 13-15, ఎంఐఎం 03-04, ఇతరులు 02-03 గెలవొచ్చు. 5.ఆసిఫాబాద్‌ లోని 20 స్థానాల్లో కాంగ్రెస్ 08-09, బీజేపీ 02-03, బీఆర్ఎస్ 06-07, ఇతరులు 0-1 విజయం సాధించనున్నారు. 6. కాగజ్‌ నగర్‌ లో 30 స్థానాలుండగా కాంగ్రెస్ 06-07, బీఆర్ఎస్ 12-13, బీజేపీ 08, ఇతరులు 02 గెలవనున్నారు. 7. బెల్లంపల్లిలో 34 స్థానాలకు కాంగ్రెస్‌ 14-16, బీఆర్ఎస్‌ 12-13, బీజేపీ 00-01, సీపీఐ  01-02, ఇతరులు 01-02 గెలవనున్నారు. 8. చెన్నూరులోని 18 స్థానాల్లో కాంగ్రెస్  9-10, బీజేపీ 01-02, బీఆర్ఎస్ 04-05, ఇతరులు 00-01 విజయం సాధించనున్నారు. 9. క్యాతనపల్లిలో 22కు గాను కాంగ్రెస్ 3-4, బీఆర్ఎస్‌ 9-10, బీజేపీ 00-01, సీపీఐ 04-05, ఇతరులు 02-03 విజయం సాధించనున్నారు. 10. లక్షెట్టిపేటలోని 15కు గాను కాంగ్రెస్ 5-8, బీఆర్ఎస్ 03-04, బీజేపీ 00-01, ఇతరులు 01-02 గెలవనున్నారు.
 

కరీంనగర్‌పై కాంగ్రెస్‌ జెండా..

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా-లో మొత్తం 13 మున్సిపాలిటీలున్నాయి. వీటిలో 10 దాకా పురపాలికలు కాంగ్రెస్‌ కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. బీఆర్‌ఎస్‌ 2, బీజేపీ చెరొక్క మున్సిపాలిటీలో పాగా వేసే ఛాన్సుందని సర్వేలో తేలింది. హుజురాబాద్‌ మున్సిపాలిటీలో మొత్తం -30 వార్డులున్నాయి. ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు-14నుంచి-16 సీట్లు బీఆర్‌ఎస్‌ 8-నుంచి10 వార్డులు గెలిచే అవకాశం ఉంది. బీజేపీ 13 కౌన్సిలర్లు గెలుచుకోనుంది.  మొత్తంగా హుజురాబాద్‌ ఓటర్లు కాంగ్రెస్‌కే పట్టం కట్టనున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ మంత్రులు శ్రీధర్‌ బాబు, పొన్న ప్రభాకర్ ప్రచారం కాంగ్రెస్‌కు ప్లస్ అయింది.  జమ్మికుంట మున్సిపాలిటీలో మొత్తం  -30 వార్డులున్నాయి. ఇక్కడ కాంగ్రెస్- 13నుంచి- 15బీఆర్‌ఎస్‌- 8నుంచి- 9, బీజేపీ 4నుంచి- 5 గెలవనున్నాయి. మొత్తంగా జమ్మికుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకోనుంది.  జగిత్యాల మున్సిపాలిటీలో - 50 వార్డులున్నాయి. ఇక్కడ కాంగ్రెస్‌ కాంగ్రెస్ - 22 నుంచి- 26 వార్డులు, బీఆర్ఎస్ - 6నుంచి8 వార్డులు, బీజేపీ 8నుంచి10 వార్డులు, ఇతరులు 6 నుంచి7, ఎంఐఎం 13 వార్డులు గెలుచుకోనున్నాయి. ఇక్కడ కూడా ఓటర్లు అధికార కాంగ్రెస్‌కే పట్టం కట్టనున్నారు. ఇక రాయికల్‌ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులుండగా 
కాంగ్రెస్ -4-నుంచి6, బీఆర్‌ఎస్‌ 1నుంచి2 , బీజేపీ2నుంచి3 గెలుచుకోనుంది. మొత్తంగా రాయికల్‌ కాంగ్రెస్‌ ఖాతాలో పడనుంది.  చొప్పదండి మున్సిపాలిటీలో 14 వార్డులుండగా ---కాంగ్రెస్ 7నుంచి9, బీఆర్‌ఎస్‌ 4 నుంచి6, బీజేపీ 1నుంచి3 వార్డులు గెలుచుకోనుంది. ఓవరాల్‌గా కాంగ్రెస్‌ ఖతాలో చొప్పదండి పడనుంది.

 ధర్మపురి మున్సిపాలిటీలో  15 వార్డులుండగా కాంగ్రెస్ -10నుంచి-11, బీఆర్‌ఎస్‌ 2నుంచి3, బీజేపీ 1నుంచి2 వార్డులు గెలుచుకోనున్నాయి. మంత్రి అడ్లూరి  నియోజకవర్గం కావడం ఇక్కడ కాంగ్రెస్‌కు ప్లస్‌ అవుతోంది. కోరుట్ల మున్సిపాలిటీలో మొత్తం 33 వార్డులుండగా బీజేపీ 7నుంచి-8, బీఆర్‌ఎస్‌ 9నుంచి10, కాంగ్రెస్‌ 14నుంచి15, ఎంఐఎం 1 గెలుచుకోనుంది. మొత్తంగా ఎంఐఎం మద్దతుతో కోరుట్లను కూడా కాంగ్రెస్ చేజిక్కించుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మెట్‌పల్లిలో మొత్తం 26 వార్డులున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్‌ 8నుంచి 9, కాంగ్రెస్‌-7నుంచి 8, బీజేపీ4నుంచి5, ఇతరులు3నుంచి 4 వార్డులు గెలుచుకోనున్నారు. మెట్‌పల్లి కూడా ఇతరుల మద్దతుతో కాంగ్రెస్‌ చైర్మన్‌ కుర్చీ గెలుచుకునే ఛాన్సుంది.  సిరిసిల్ల మున్సిపాలిటీలో మొత్తం 39 వార్డులుండగా ఇక్కడ బీఆర్ఎస్ - 21నుంచి-22, కాంగ్రెస్  19నుంచి-20, బీజేపీ 5-నుంచి6, ఇతరులు 1 గెలుచుకోనున్నారు. కేటీఆర్‌ సొంత నియోజకవర్గమైన సిరిసిల్ల మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగిరే అవకాశం ఉంది. వేములవాడలో28 వార్డులుండగా బీజేపీ -9నుంచి-10, బీఆర్ఎస్‌ -10నుంచి-11, కాంగ్రెస్ -5నుంచి-6, 
ఇతరులు -ఒక్క వార్డు గెలవనున్నారు. ఇక్కడ హంగ్‌ ఏర్పడే అవకాశముంది. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఉన్నా కాంగ్రెస్‌కు కలిసి రాలేదు.  మంథని మున్సిపాలిటీలో మొత్తం13 వార్డులుండగా కాంగ్రెస్‌కు 6నుంచి7, బీఆర్‌ఎస్‌ 2-నుంచి4  వార్డులు గెలుచుకోనున్నాయి. చైర్మన్‌ పీఠం కాంగ్రెస్‌కే దక్కనుంది. పెద్దపల్లిలో  మొత్తం -36 వార్డులుండగా కాంగ్రెస్ 23-నుంచి 24, బీఆర్ఎస్ 05నుంచి-06, AIFB 4నుంచి5, ఇతరులు -1 గెలవనున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌కే విజయావకాశాలు ఎక్కువ. ఎమ్మెల్యే విజయరమణారావు కేడర్ ప్లస్‌ అయింది. సుల్తానాబాద్‌లో మొత్తం 15 వార్డులుండగా కాంగ్రెస్ 6నుంచి7, బీఆర్ఎస్ 4నుంచి5, బీజేపీ 2-నుంచి3 గెలవనున్నాయి.  కాంగ్రెస్‌కే చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉంది. 
 

ఖమ్మంలో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 7 మున్సిపాలిటీలు ఉండగా.. వాటన్నింటిని అధికార పార్టీనే హస్తగతం చేసుకునే అవకాశముందని సర్వేలు చెబుతున్నాయి. ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉండడమే కాంగ్రెస్‌కు కలిసొచ్చే ఛాన్స్‌గా చెప్పుకొచ్చారు. ఏదులాపురం మున్సిపాలిటీలో 32 వార్డులు ఉండగా.. ఇప్పటికే ఒక స్థానాన్ని కాంగ్రెస్ ఏకగ్రీవం చేసుకుంది. సర్వే లెక్కల ప్రకారం ఇక్కడ కాంగ్రెస్‌ 18 నుంచి 20 స్థానాలు, బీఆర్ఎస్‌కు 5 నుంచి 6 స్థానాలు, సీపీఐకి 4 నుంచి 5, సీపీఎం, బీజేపీలకు ఒక్కో స్థానంలో గెలిచే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. మధిరలో ఉన్న 22 స్థానాల్లో కాంగ్రెస్ 13 నుంచి 14, గులాబీ పార్టీకి 5 నుంచి 6, సీపీఐ, సీపీఎం, బీజేపీలో ఒక్కో స్థానాన్ని గెలిచే అవకాశాలున్నాయి. వైరాలో 20 వార్డుల్లో కాంగ్రెస్ 8-9, బీఆర్ఎస్ 6-7, బీజేపీ 0-1, సీపీఐ 0-1, సీపీఎం 1-2 స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వే అంచనా. ఇక కల్లూరు మున్సిపాలిటీలోని 20 స్థానాల్లో 12 నుంచి 14 స్థానాలు అధికార పార్టీకి, 4 నుంచి 6 స్థానాల్లో కారు పార్టీ గెలుస్తుందని సర్వేలో తేలింది. సత్తుపల్లిలోని 23 స్థానాల్లో కాంగ్రెస్ 5-17, బీఆర్ఎస్ 4-6 చోట్ల గెలుస్తుందని అంచనా వేశారు. ఇల్లందులో 24 స్థానాలు ఉండగా.. ఇక్కడ 13 నుంచి 15 వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని, ఇక బీఆర్ఎస్‌కి 3-5, సీపీఐ -1, ఇతరులు 0-3 చోట్ల గెలిచే అవకాశాలు ఉన్నాయి. అశ్వారావుపేటలో మొత్తం 22 స్థానాల్లో కాంగ్రెస్ 12-14 గెలుచుకుంటుందని, బీఆర్ఎస్ 6 నుంచి 8, సీపీఐ 0-1, ఇతరులు 0-1 స్థానాలు దక్కించుకుంటారని సర్వేలు చెబుతున్నాయి. మధిర, వైరా, సత్తుపల్లి ఛైర్మన్ స్థానాలు జనరల్ మహిళకు రిజర్వ్ కాగా.. కల్లూరు ఎస్సీ మహిళకు, ఇల్లందు బీసీ మహిళకు రిజర్వ్ అయ్యాయి. ఏదులాపురం ఛైర్మన్‌ స్థానం ఎస్సీ రిజర్వుడు అయితే, అశ్వారావుపేటను జనరల్‌ కోటాకు కేటాయించారు.

నల్గొండలో కాంగ్రెస్  క్లీన్ చీఫ్..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 17 మున్సిపాల్టీలు ఉన్నాయి. అన్నింటినీ కాంగ్రెస్ పార్టీ క్లీన్ చీఫ్ చేస్తూ మేయర్ పీఠాలను దక్కించుకోనున్నది. 1. ఆలేరు 12 స్థానాల్లో బీఆర్ఎస్ 0-6, కాంగ్రెస్-6, బీజేపీ 0-1 స్థానాలు రానున్నాయి. 2.భువనగిరిలో 35కు కాంగ్రెస్-20, బీఆర్ఎస్-10, బీజేపీ-5 గెలనున్నాయి. 3.చౌటుప్పల్‌ లోని 20 స్థానాల్లో కాంగ్రెస్-14, బీఆర్ఎస్-06 గెలవనున్నది. 4.మోత్కూరులో 12కు గాను బీఆర్ఎస్ -5, కాంగ్రెస్-7 విజయం సాధించనున్నది. 5.పోచంపల్లిలో 13 స్థానాలకు గాను బీఆర్ఎస్-5, కాంగ్రెస్ -7, ఇతరులు-1 గెలవనున్నారు. 6. యాదగిరిగుట్టలో 12 స్థానాలకు గాను బీఆర్ఎస్-5, కాంగ్రెస్-6, ఇతరులు-1 గెలవనున్నారు.  7.హుజూర్‌నగర్‌ లో 28కు గాను కాంగ్రెస్-20, బీఆర్ఎస్ 3-5, సీపీఎం-1, ఇతరులు-3 విజయం సాధించనున్నారు.

8. కోదాడలో 35 స్థానాలకు కాంగ్రెస్ 25+3(ఏకగ్రీవం), బీఆర్ఎస్-5, ఇతరులు-2 దక్కించుకోనున్నారు. 9. నేరేడుచర్లలో15కు గాను బీఆర్ఎస్ -5, కాంగ్రెస్-10 స్థానాలను కైవసం చేసుకొనున్నాయి. 10. సూర్యాపేటలో 48 స్థానాల్లో కాంగ్రెస్-30, బీఆర్ఎస్-18 దక్కనున్నాయి. 11.తిరుమలగిరిలో 15కు గాను బీఆర్ఎస్-5, కాంగ్రెస్-7 స్థానాలను సాధించనున్నాయి. 12. చండూర్‌ 10 స్థానాల్లో కాంగ్రెస్-05, బీఆర్ఎస్-05 దక్కనున్నాయి. 13.చిట్యాల 12 స్థానాలకు గాను బీఆర్ఎస్ 4-5, కాంగ్రెస్ -7 గెలవనున్నది. 14. దేవరకొండ 20లో కాంగ్రెస్-12, బీఆర్ఎస్-5, బీజేపీ-2, ఇతరులు-01 విజయం సాధించనున్నారు. 15.హాలియాలోని 12 స్థానాలకు గాను కాంగ్రెస్-10,బీఆర్ఎస్-2 దక్కించుకోనున్నాయి. 16.మిర్యాలగూడలోని 48కి గాను కాంగ్రెస్-46, బీఆర్ఎస్-02 సాధించనున్నాయి. 17. నందికొండలోని 12 స్థానాలకు గాను బీఆర్ఎస్-1, కాంగ్రెస్-11 దక్కించుకోనున్నాయి. నకిరేకల్ లో ఎన్నికలు లేవు.

ఇందూరులో హస్తం హవా.. 

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 7 మున్సిపాలిటీలుండగా ఇక్కడ ఆరు పురపాలికల్లో కాంగ్రెస్‌ జోరు స్పష్టంగాకనిపిస్తోంది. ఒక్క ఆర్మూర్‌లో మాత్రం బీఆర్‌ఎస్‌ అత్యధిక స్థానాలు గెలుచుకోనుంది. అయినా ఇక్కడ కూడా ఇతరులతో కలిసి కాంగ్రెస్‌ చైర్మన్ పీఠం దక్కించుకునే అవకాశాలు లేకపోలేదు. జిల్లాలోని  బిచ్కుంద- మున్సిపాలిటీలో 12 వార్డులుండగా కాంగ్రెస్- 8, బీఆర్ఎస్- 4 గెలుచుకోనున్నాయి. కాంగ్రెస్ కే మున్సిపల్ చైర్మన్ కుర్చీ దక్కనుంది.  ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ఉన్న -12 వార్డుల్లో కాంగ్రెస్- 7, బీఆర్ఎస్- 4, ఇతరులు--1 గెలవనున్నాయి. చైర్మన్‌ పీఠం కాంగ్రెస్‌కే దక్కనుంది. బాన్సువాడ మున్సిపాలిటీలో ఉన్న -19 వార్డుల్లో కాంగ్రెస్ -10, బీఆర్ఎస్  5, బీజేపీ -2, ఇతరులు -2 గెలవనున్నారు. చైర్మన్‌ పీఠం కాంగ్రెస్‌ ఖాతాలోకి రానుంది. కామారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం -49 వార్డులున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ - 25, బీజేపీ -10, బీఆర్ఎస్ -12, ఎంఐఎం -1, ఇతరులు 1 గెలుచుకోనున్నారు. చైర్మన్‌ కుర్చీ కాంగ్రెస్‌కే దక్కనుంది.  బోధన్ మున్సిపాలిటీలో మొత్తం -38 వార్డులున్నాయి.   ఇక్కడ కాంగ్రెస్ -16, బీఆర్ఎస్ -10, ఎంఐఎం -7, బీజేపీ -3, ఇతరులు -2 గెలవనున్నారు. కాంగ్రెస్, ఎంఐఎం కూటమి మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకోనుంది. --
భీమ్ గల్  మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులున్నాయి. ఇక్కడ -కాంగ్రెస్ -7, బీఆర్ఎస్ -4, బీజేపీ -1 వార్డులు గెలవనున్నాయి. కాంగ్రెస్‌కే మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కనుంది.  ఆర్మూర్  మున్సిపాలిటీలో మొత్తం -36 వార్డులున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ -14, బీఆర్ఎస్-15, బీజేపీ -4, ఇతరులు -3 వార్డులు గెలుచుకోనున్నారు. ఇక్కడ కౌన్సిలర్‌ సీట్లు అత్యధికంగా గులాబీ పార్టీ గెలవనున్నప్పటికీ ఇతరులతో కలిసి కాంగ్రెస్‌ చైర్మన్ పీఠం దక్కించుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

 మహబూబ్‌నగర్‌లోనూ హస్తం హవా

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న 18మున్సిపాలిటీల్లో అత్యధికంగా కాంగ్రెస్ 11 స్థానాలను కైవసం చేసుకుంటుందని సర్వేలో తేలింది. ఇక్కడ బీజేపీకి 4, బీఆర్ఎస్‌కు 3 స్థానాలు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేవరకద్రలో బీసీల సంఖ్య ఎక్కువగా ఉండడం కమలం పార్టీకే కలిసొస్తుందని చెబుతున్నారు. ఇక్కడున్న 12 వార్డుల్లో బీజేపీ అత్యధకంగా 6 గెలుస్తాయని సర్వేలు చెబుతుండగా.. మిగిలిన 6లో కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 2గెలిచే అవకాశాలున్నాయి. అమరచింతలో 10 వార్డుల్లో కాంగ్రెస్ 5-6, బీఆర్ఎస్ 1-2, బీజేపీ 1-2స్థానాలను కైవసం చేసుకుంటుందని అంచనా వేస్తున్నారు. భూత్పూర్‌లో 10 స్థానాల్లో కాంగ్రెస్ 6, బీఆర్ఎస్, బీజేపీ చెరో రెండింటిలో విజయం సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ఇక నారాయణపేటలోని 24 స్థానాల్లో బీఆర్ఎస్ 8-10 స్థానాల్లో విజయం సాధిస్తుందని, అలాగే కాంగ్రెస్‌కు 6-8, బీజేపీకి 4-6 స్థానాలు దక్కుతాయని అంచనా. అలంపూర్‌ 10 వార్డుల్లో కాంగ్రెస్ 4-6 చోట్ల ఆధిక్యంలో ఉంటుందని, బీఆర్ఎస్ 1-3, ఇతరులు ఒక చోట విజయం సాధిస్తారని సర్వేలో తేలింది. వడ్డేపల్లిలోని 10 వార్డుల్లో బీఆర్ఎస్ 1 నుంచి 5, కాంగ్రెస్ 2నుంచి 4 దక్కించుకుంటాయని.. అలాగే ఇతరులు ఒక చోట విజయం సాధించే అవకాశాలున్నాయి. అయిజలో ఉన్న 20 స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా వేశారు. కాంగ్రెస్ 8-9, బీఆర్ఎస్ 8-10 వార్డుల్లో గెలుస్తాయని చెబుతున్నారు. బీజేపీకి ఒకచోట మాత్రమే విజయం వరిస్తుందని అంచనా. గద్వాల్‌, నాగర్‌కర్నూలు, కల్వకుర్తిలో వార్‌ వన్‌ సైడ్ అవుతుందని సర్వేలు చెబుతున్నాయి. గద్వాల్ 37 స్థానాలు, నాగర్‌కర్నూల్ 24స్థానాలు, కల్వకుర్తి 22 స్థానాల్లో కాంగ్రెస్ జెండానే ఎగరబోతుందని అంటున్నారు. వనపర్తిలో ఉన్న 33 స్థానాల్లో కాంగ్రెస్ 20, బీఆర్ఎస్ 8, బీజేపీ 5 చోట్ల గెలిచే అవకాశాలున్నాయి. పెబ్బేరులోని 12 వార్డుల్లో కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 3, బీజేపీ ఒక చోట విజయం సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ఇక కొత్తకోటలోని 15 స్థానాల్లో బీజేపీ 8చోట్ల జెండా ఎగరేస్తుందని అంచనా. బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 3 చోట్ల గెలిచే అవకాశముంది. ఆత్మకూరులో 10 వార్డులు ఉండగా.. మెజార్టీ స్థానాలు బీజేపీ 4నుంచి 6 కైవసం చేసుకునే అవకాశముంది. కాంగ్రెస్ 2-3, బీఆర్ఎస్ 0-1 చోట్ల విజయానికి ఛాన్స్ ఉన్నాయి. కోస్గిలోని 16 స్థానాల్లో 9-10 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని, బీఆర్ఎస్‌కి 3-4, బీజేపీకి 1-2 చోట్ల అవకాశాలున్నాయని అంచనా వేశారు. మద్దూరులోని 16 వార్డుల్లో ఒక్క కాంగ్రెస్‌కే 10-11 గెలిచే అవకాశముందని సర్వే లెక్కల్లో తేలింది. బీఆర్ఎస్ 2-4, బీజేపీ 0-1 చోట గెలుస్తాయని అంచనా. మక్తల్‌లో బీజేపీ హవా కనిపిస్తుంది. ఇక్కడున్న 16 స్థానాల్లో బీజేపీ 10చోట్ల గెలిచే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ 3-4, బీఆర్ఎస్ 0-2 స్థానాల్లో మాత్రమే విజయాలు సాధించే ఛాన్స్ ఉంది. అటు కొల్లాపూర్‌ను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని మొత్తం 19 స్థానాల్లో 15 కాంగ్రెస్‌కు, 4 బీఆర్ఎస్ గెలిచే అవకాశాలున్నాయి.

 మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ లీడ్

ఉమ్మడి మెదక్ జిల్లాలో 19 మున్సిపాల్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్-11, కాంగ్రెస్-08 మున్సిపాల్టీలను గెలిచి మేయర్ పీఠాలను కైవసం చేసుకోనున్నాయి. 1.ఇస్నాపూర్ లో-26 వార్డులుండగా బీఆర్ఎస్‌ 9-10, కాంగ్రెస్ 12-15, బీజేపీ-0-1 గెలవనున్నాయి. 2.ఇంద్రేశంలో  18 వార్డులకు గాను బీఆర్ఎస్ 7-10, కాంగ్రెస్ 1-4, బీజేపీ 2-3 దక్కించుకోనున్నాయి. 3. జిన్నారంలో 20 వార్డుల్లో బీఆర్ఎస్ 8-10,  కాంగ్రెస్ 9-10 విజయం సాధించనున్నాయి. 4.గుమ్మడిదలలో 22 వార్డులకు గాను బీఆర్ఎస్‌ 12-14, కాంగ్రెస్ 3-5, బీజేపీ 1-3 స్థానాల్లో గెలవనున్నాయి. 5. గడ్డపోతారంలోని 18 వార్డుల్లో బీఆర్ఎస్‌ 10-11, కాంగ్రెస్ 4-06, బీజేపీ 0-1 దక్కించుకోనున్నాయి. 6. సదాశివపేటలోని 26 వార్డుల్లో బీఆర్ఎస్ 9-11, కాంగ్రెస్10-12, బీజేపీ 1-2, ఇతరులు 0-1 గెలవబోతున్నారు. 7. సంగారెడ్డిలో 38 వార్డులుండగా కాంగ్రెస్12-16, బీజేపీ 2-4, ఎంఐఎం 1-2, బీఆర్ఎస్12-14, ఇతరులు 0-2 దక్కించుకోనున్నారు. 8. ఆందోల్ లో 20 వార్డులకు గాను బీఆర్ఎస్ 4-5, కాంగ్రెస్12-14, బీజేపీ 0-1 విజయం సాధించనున్నాయి. 9. కోహిర్ 16 వార్డులకు గాను కాంగ్రెస్ 06-07,
బీఆర్ఎస్ 5-6, ఎంఐఎం 0-1, బీజేపీ 0-1, ఇతరులు 0-1 దక్కించుకోనున్నారు. 10. నారాయణఖేడ్ లోని 15 వార్డుల్లో బీఆర్ఎస్ 0-1,
కాంగ్రెస్10-11, బీజేపీ 2-3 గెలవనున్నారు. 11. జహీరాబాద్ లోని 37 వార్డుల్లో కాంగ్రెస్ 14-15, బీఆర్ఎస్ 17-18, ఎంఐఎం 1-2,
బీజేపీ1-2 దక్కించుకోనున్నాయి. 12. మెదక్ లోని 32 వార్డులకు గాను బీఆర్ఎస్14-15, కాంగ్రెస్12-13, బీజేపీ 2-3, ఇతరులు 0-1 దక్కించుకోనున్నారు. 13. రామాయంపేటలోని 12-వార్డులుండగా కాంగ్రెస్ 05-06, బీఆర్ఎస్ 2-3, బీజేపీ 02-03 గెలవనున్నాయి. 14. నర్సాపూర్ లోని 15 వార్డుల్లో బీఆర్ఎస్ 05-06, బీజేపీ 05-06, కాంగ్రెస్ 02-03 గెలవనున్నాయి. 15. తూప్రాన్ లోని16 వార్డులకు గాను కాంగ్రెస్ 07-08, బీఆర్ఎస్ 05-06, బీజేపీ 01-02 దక్కించుకోనున్నాయి. 16. దుబ్బాక లోని 20 వార్డుల్లో బీఆర్ఎస్ 9-10, కాంగ్రెస్ 06-07,
బీజేపీ 1-02, ఇతరులు 0-1 గెలవబోతున్నారు. 17. గజ్వేల్ లోని 20 వార్డులకు గాను బీఆర్ఎస్‌ 9-10, కాంగ్రెస్ 7-8, బీజేపీ 1-2 విజయం సాధించనున్నాయి. 18. హుస్నాబాద్ లోని 20 స్థానాలకు గాను కాంగ్రెస్ 11-12, బీఆర్ఎస్‌ 3-4, ఇతరులు 3-4 సాధించనున్నారు. 19. చేర్యాలలోని 12 స్థానాలకు గాను కాంగ్రెస్ 6-8, బీఆర్ఎస్ 3-4 స్థానాలను గెలవబోతున్నాయి.

రంగారెడ్డిలో కాంగ్రెస్‌ జోరు.. 

\రంగారెడ్డి జిల్లాలో మొత్తం13 మున్సిపాలిటీలుండగా  కాంగ్రెస్- 11, బీఆర్ఎస్ - 2 మున్సిపాలిటీలు దక్కించుకోనున్నాయి. ఇక్కడ ఆమనగల్‌ పురపాలికలో మొత్తం 15 వార్డులున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ -7-నుంచి9, బీఆర్ఎస్- 3నుంచి-5, బీజేపీ -1 వార్డు గెలుచుకోనున్నాయి. కాంగ్రెస్‌కే చైర్మన్‌ పీఠం దక్కనుంది.  ఇక చేవెళ్లలో (18) వార్డులుండగా ఇక్కడ కాంగ్రెస్ 8నుంచి-10, బీఆర్ఎస్ 3టు-5, బీజేపీ 0-3 వార్టులు గెలవనున్నాయి. చేవెళ్లలో కాంగ్రెస్‌కే చైర్మన్‌ కుర్చీ దక్కనుంది. ఇబ్రహీంపట్నంలో (24) వార్డులుండగా కాంగ్రెస్ -12నుంచి-14, బీఆర్ఎస్ - 2టు4, బీజేపీ -2, ఇతరులు -2 వార్డులు గెలవనున్నారు. మొయినాబాద్‌ మున్సిపాలిటీలో (26) వార్డులుండగా కాంగ్రెస్ 17నుంచి-19, బీఆర్ఎస్ 03-05, బీజేపీ0-2 వార్డులు గెలవనున్నాయి. ఇక్కడ చైర్మన్‌ కుర్చీ కాంగ్రెస్‌కే క్లియర్‌గా దక్కనుంది. ఇక షాద్‌నగర్‌ పురపాలికలో మొత్తం 28 వార్డులున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ 20నుంచి-22 వార్డులు, బీఆర్ఎస్ 02-నుంచి04, బీజేపీ 0-2 వార్డులు గెలవనున్నాయి. మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగరనుంది. శంకర్‌పల్లిలో (15) వార్డులుండగా కాంగ్రెస్ 07-నుంచి09, బీఆర్ఎస్ 03నుంచి-05, బీజేపీ 0-1 వార్డులు గెలవనున్నాయి. పురపాలికలో కాంగ్రెస్‌ విజయఢంకా మోగించనుంది. కొడంగల్‌లో 12 వార్డులున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ 8-టు10, బీఆర్ఎస్ 0-2 వార్డులు గెలుచుకోనున్నాయి. సీఎం సొంత నియోజకవర్గం కావడంతో ఇక్కడ కాంగ్రెస్‌దే పైచేయి కానుంది. పరిగిలో  (18) వార్డులున్నాయి. ఇక్కడ కాంగ్రెస్‌కు 10టు-12, బీఆర్ఎస్ 04టు-06, బీజేపీ 0-1 వార్డులు గెలవనున్నాయి. చైర్మన్‌ కాంగ్రెస్‌కే దక్కనుంది. తాండూర్‌లో  (36) వార్డులున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ 25టు-29, బీఆర్ఎస్ 04-టు07 గెలవనున్నాయి. వికారాబాద్‌లో  (34) వార్డులున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ 25టు-29, బీఆర్ఎస్ 0-4, బీజేపీ 0-1 గెలవనున్నాయి. అలియాబాద్‌లో (20) వార్డులున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ 06టు-08, బీఆర్ఎస్ 10టు-11, బీజేపీ 0-1 గెలవనున్నాయి. ఇక్కడ బీఆర్‌ఎస్‌ చైర్మన్‌ పీఠం దక్కించుకోనుంది. మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో (24) వార్డులున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ కు16నుంచి-17, బీఆర్ఎస్ 02టు-04, బీజేపీ 0-1 గెలవనున్నాయి. ఎల్లంపేట మున్సిపాలిటీలో (24) వార్డులున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ 7-టు9, బీఆర్ఎస్ 12టు-14 గెలవనున్నాయి. బీఆర్‌ఎస్‌ ఇక్కడ కూడా చైర్మన్‌ కుర్చీ దక్కించుకోనుంది. 

కాంగ్రెస్ వైపు వరంగల్ మొగ్గు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాల్టీలున్నాయి. అందులో కాంగ్రెస్- 08, బీఆర్ఎస్-04 మేయర్ పీఠాలను దక్కించుకోనున్నాయి. 1.నర్సంపేటలోని 30 స్థానాలకు గాను కాంగ్రెస్ 12-14, బీఆర్ఎస్ 12-14, బీజేపీ 0-2 స్థానాలు గెలవనున్నాయి. 2. వర్ధన్నపేటలోని 12కు గాను కాంగ్రెస్ 3-4, బీఆర్ఎస్ 4-6, బీజేపీ 02, ఇతరులు 01 విజయం సాధించనున్నారు. 3. పరకాలలోని 22కు గాను కాంగ్రెస్ 6-8, బీఆర్ఎస్ 8-10, బీజేపీ 2-4, ఇతరులు 02 దక్కించుకోనున్నారు. 4. ములుగులోని 20 స్థానాల్లో కాంగ్రెస్ 8-10, బీఆర్ఎస్ 7-9, బీజేపీ 01,
ఇతరులు 00 గెలవనున్నారు. 5. భూపాలపల్లిలోని 30కు గాను కాంగ్రెస్ 10-12, సీపీఐ 0-1, సీపీఎం 0-1, బీఆర్ఎస్ 13-15, బీజేపీ 5-6 స్థానాలను దక్కించుకోనున్నాయి. 6. జనగామలోని 30 స్థానాల్లో కాంగ్రెస్ 7-9, బీఆర్ఎస్ 10-12, బీజేపీ 0-2, సీపీఎం 0-2, ఇతరులు 0-1 గెలవనున్నారు. 7. స్టేషన్‌ ఘన్‌పూర్‌ లోని 18కు గాను కాంగ్రెస్ 7-9, బీఆర్ఎస్ 5-7, బీజేపీ 0-1, ఇతరులు 0-1 విజయం సాధించనున్నారు. 8. తొర్రూర్‌ లోని 16 స్థానాల్లో కాంగ్రెస్ 7-9, బీఆర్ఎస్ 4-6 గెలవనున్నాయి. 9. కేసముద్రంలోని 16కు గాను కాంగ్రెస్ 7-9, బీఆర్ఎస్ 4-6, ఇతరులు 0-2 దక్కించుకోనున్నారు. 10. డోర్నకల్‌ లోని 15 స్థానాలకు గాను కాంగ్రెస్ 5-7, బీఆర్ఎస్ 4-6, బీజేపీ 0-1, ఇతరులు 0-1 గెలవనున్నారు. 11. మరిపెడలోని 15 స్థానాలకు గాను కాంగ్రెస్ 6-8, బీఆర్ఎస్ 4-6, ఇతరులు 0-2 విజయం సాధించనున్నారు. 12. మహబూబాబాద్‌ లోని 36కు గాను కాంగ్రెస్ 20-22, బీఆర్ఎస్ 8-10, బీజేపీ 0-3, ఇతరులు 0-1 గెలవనున్నారు. 

Advertisment
తాజా కథనాలు