/rtv/media/media_files/2025/09/12/mee-seva-2025-09-12-10-29-13.jpg)
Mee seva
గతంలో కుల ధ్రువీకరణ పత్రాలను(Caste Certificate) పొందాలంటే ప్రతి దరఖాస్తుకు తహశీల్దార్ ఆమోదం పొందాల్సి ఉండేది. ఇక నుంచి ఈ సర్టిఫికేట్లు సులభంగా పొందేలా 'మీ సేవ'(mee-seva) కొత్త ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వాళ్లు నేరుగా మీ సేవ కేంద్రాల్లోనే కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకోవచ్చు. గతంలో తహశీల్దార్ అవసరం ఉండటం వల్ల ఈ సర్టిఫికేట్లు పొందడంలో ఆలస్యం జరిగేది. ఈ సమస్యను నివారించేందుకే ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇచ్చిన ఆదేశాల మేరకు మీసేవ విభాగం దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.
Also Read: భారత్, అమెరికాల మధ్య సంధి.. త్వరలోనే వాణిజ్య ఒప్పందం..మంత్రి పియూష్ గోయల్
Community Certificates Now In Mee-Seva
CCLA, ఎస్సీ సంక్షేమ, జిల్లా అడ్మినిస్ట్రేటివ్, బీసీ సంక్షేమ అధికారులు, అలాగే తహశీల్దార్‌లతో పలుసార్లు సమావేశాలు నిర్వహించిన తర్వాత ఈ తాజా మార్పులు చేపట్టారు. ఈ మార్పును15 రోజుల క్రితమే అమల్లోకి తీసుకొచ్చారు. ఇప్పటికే 17,571 మంది దరఖాస్తుదారులు ఈ సేవలను వినియోగించుకుని సులభంగా క్యాస్ ఇన్‌కమ్ సర్టిఫికేట్లు పొందారు. ప్రతి ఏడాది చూసుకుంటే దాదాపు 20 లక్షల మంది కుల ధ్రువీకరణ పత్రాల కోసం అప్లై చేసుకుంటారు. ఇక కొత్తగా జారీ చేసే సర్టిఫికేట్లలో గతంలో ఆమోదించిన అధికారి వివరాలు, తిరిగి జారీ చేసిన తేదీలు ఉంటాయి.
Also Read: సైబర్ నేరగాళ్ల వలలో జనసేన ఎంపీ.. ఏకంగా రూ.92 లక్షలు ఎలా కొట్టేశారంటే?
కొన్నిసార్లు ప్రత్యేక కేసుల్లో అంటే హిందూ ఎస్సీ నుంచి క్రైస్తవంలోకి మారినప్పుడు బీసీసీ కిందకు వస్తుంటారు. దీంతో జీవో ఎంఎస్ నం.3, తేదీ 9.9.2020 ప్రకారం దరఖాస్తును గత ప్రక్రియ ప్రకారం ఆమోదం కోసం పంపిస్తారు. పాత సర్టిఫికేట్ నెంబర్ తెలిస్తే మీసేవ కౌంటర్‌లో ఆ నెంబర్‌ను అందించి కొత్త ప్రింట్అవుట్ పొందచ్చు. ఒకవేళ నెంబర్ తెలియకుంటే మీ సేవ సిబ్బంది మీ జిల్లా, మండలం, గ్రామం, ఉపకులం, పేరు ఆధారంగా పరిశీలిస్తారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు మీసేవ వెబ్‌సైట్ లేదా సమీపంలో మీసేవ కేంద్రాన్ని సంప్రదించవచ్చు.
Also Read: గ్రూప్-1 రీవాల్యుయేషన్ ఇష్యూ.. TGPSC సంచలన నిర్ణయం!