India-US Trade deals: భారత్, అమెరికాల మధ్య సంధి.. త్వరలోనే వాణిజ్య ఒప్పందం..మంత్రి పియూష్ గోయల్

అమెరికా, భారత్ ల వాణిజ్య చర్చల్లో పురోగతి ఉందని..రెండు దేశాలూ త్వరలోనే ఒక డీల్ ను చేసుకుంటాయని వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ చెబుతున్నారు. నవంబర్ నాటికి దీన్ని ఫైనల్ చేస్తామని తెలిపారు.

New Update
piyush

Minister Piyush Goyal

మొత్తానికి అమెరికా, భారత్ లు ఒకదారిలోకి వచ్చాయి. రెండు దేశాల మధ్య వాణిజ్య సంధి కుదుర్చుకుంటున్నాయి. ట్రంప్ అదనపు సుంకాల కారణంగా నిన్నటి వరకూ కొట్టుకున్న భారత్, అమెరికాలు మొత్తానికి ఒక తాటిమీదకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా కాస్త దిగి వచ్చినట్టు కనిపించింది. తానే స్వయంగా భారత ప్రధాని మోదీతో మాట్లాడతానని చెప్పారు. దీనికి మోదీ కూడా సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు పాట్నాలో జరిగిన మీడియా సమావేశంలో వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్గోయల్ కూడా వాణిజ్య చర్చలు ఆశాజనకంగా ఉన్నాయంటూ మాట్లాడారు.

నవంబర్ కల్లా..

ఫ్రిబ్రవరిలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మన ప్రధాని మోదీ నవంబర్ నాటికి వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని చెప్పారు. అందులో భాగంగా ఇప్పటికే ఆరు విడతలుగా చర్చలు చేశాము. అయితే మధ్యలో టారిఫ్ ల వలన వాటికి బ్రేక్ వచ్చాయి. కానీ ఇప్పుడు మళ్ళీ రెండు దేశాలు చర్చలకు రెడీ అయ్యాయి. ఈ నేపథ్యంలో నవంబర్ లో కల్లా చర్చలు ఓ కొలిక్కి వచ్చి ఒప్పందాలు కుదుర్చుకుంటామని మంత్రి పియూష్గోయల్ తెలిపారు. చర్చలు చాలా తీవ్రంగా జరుగుతున్నాయని..పురోగతి సాధిస్తున్నామని చెప్పారు.

ట్రంప్ స్వరంలో మార్పు..

భారత్, అమెరికా సంబంధాల్లో మళ్ళీ మార్పులు వస్తున్నాయి. వాణిజ్య సుంకాల కారణంగా రెండు దేశాల మధ్యా ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న నేపథ్యంలో ప్రధాని మోదీతోట్లాడేందుకు ఎదురు చూస్తున్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రధాని మోదీ కూడా స్పందించారు. తాను కూడా ట్రంప్ తో మాట్లాడేందుకు వెయిట్ చేస్తున్నానని తెలిపారు. భారత్, యూఎస్ క్లోజ్ ఫ్రెండ్స్ అని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధినేతల స్వరాల్లో మార్పు చాలా కీలకంగా మారింది.

అయితే మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యూరోపియన్ యూనియన్ కు చైనా, భారత్ లపై 100 శాతం సుంకాలను విధించండి అంటూ సూచించడం ఆందోళన కలిగిస్తోంది. వాషింగ్టన్‌లో సీనియర్ అమెరికన్, యూరోపియన్ యూనియన్ అధికారులు రష్యాపై ఆంక్షలు విధించే అంశంపై భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ఈయూ అధికారులతో కాన్ఫరెన్స్‌ కాల్‌లో మాట్లాడారు. రష్యాపై మరింత ఆర్థిక ఒత్తిడిని తీసుకొచ్చేందుకు భారత్, చైనాపై 100 శాతం సుంకం(trump tariffs) విధించాలని వాళ్లకి సూచించినట్లు సమాచారం. ఆ దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని ఆపేస్తామనిచెప్పేవరకు ఈ సుంకాలు కొనసాగించాలని కోరారు.

Advertisment
తాజా కథనాలు