/rtv/media/media_files/2025/05/07/mLpWUX7x6GAyU5YnVfUv.jpg)
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి బుధవారం ఉన్నత స్థాయి అధికారులతో సమావేశమైయ్యారు. ఈ మీటింగ్‌లో ఆపరేషన్ సిందూర్, మాక్‌డ్రిల్ పరిస్థితులపై చర్చించారు. ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో భద్రత కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అన్నీ శాఖలు పూర్తి సమన్వయంతో పని చేయాలని అధికారులను కోరారు. అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలన్నారు.
#Hyderabad :
— Surya Reddy (@jsuryareddy) May 7, 2025
Chief Minister #RevanthReddy inspects the Integrated Command Control Centre (#ICCC) and directed the @hydcitypolice @TelanganaCOPs
•Vigilant about #CyberSecurity and warned of stringent action against those who peddle #FakeNews.
•Special Cell to curb Fake News… pic.twitter.com/bMgaqJ7NvN
ఎయిర్‌పోర్టు, విదేశీ రాయబార కార్యాలయాల దగ్గర భద్రత పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భారత సైన్యాన్ని మద్దతు తెలుపుతూ.. గురువారం జరిగే ర్యాలీలో పాల్గొనాలని యువతకు పిలుపు నిచ్చారు. కేంద్ర రక్షణ రంగ సంస్థ దగ్గర హై సెక్యురీటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
(hyderabad | high-alert | cm-revanth-reddy | telangana | operation Sindoor | attack in Pahalgam | india on pahalgam attack | latest-telugu-news)