/rtv/media/media_files/2025/09/22/pm-modi-2025-09-22-20-30-49.jpg)
PM Modi
ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి సంచలన లేఖ విడుదల చేశారు. జీఎస్టీ పొదుపు ఉత్సవం నేటి నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమైందని అన్నారు. దేశ ప్రజలు స్వదేశీ వస్తువులే విక్రయించాలంటూ సూచనలు చేశారు. ''జీఎస్టీ సంస్కరణ ప్రజల పొదుపును మరింత పెంచనున్నాయి. యువత, రైతులు, మహిళలు, వ్యాపారులు, మధ్యతరగతి, MSME తదితర అన్ని వర్గాల వారికి మేలు చేకూరుతుంది. ఆర్థిక వృద్ధితో సహా పెట్టుబడులను సైతం ప్రోత్సహిస్తాయి.
Also Read: ఎంపీ భార్యను డిజిటల్ అరెస్టు చేసిన సైబర్ కేటుగాళ్లు.. రూ.14 లక్షలు కాజేసి..
దేశంలో ప్రతి రాష్ట్రం కూడా మరింత పురోగతిని సాధిస్తాయి. శ్లాబుల తగ్గింపు వల్ల ఆర్థిక వ్యవస్థ సరళీకృతం అవుతుంది. వ్యాపార నిర్వహణలు సులభతరం కానున్నాయి. దేశంలో 25 కోట్ల మంది కొన్నేళ్లలోనే పేదరికం నుంచి బయటపడ్డారు. ఆదాయపు పన్ను రూ.12 లక్షల వరకు మినహాయించాం. కొత్త జీఎస్టీ శ్లాబుల వల్ల ఈ ఏడాది ప్రజలకు రూ.2.50 లక్షల కోట్ల డబ్బు ఆదా కానుంది. వికసిత్ భారత్ లక్ష్యం కోసం మనమందరం స్వయం సమృద్ధి బాటలో నడవడం అవసరం. కొత్తగా తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరలు స్థానిక తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి.
This festive season, let's celebrate the 'GST Bachat Utsav'! Lower GST rates mean more savings for every household and greater ease for businesses. pic.twitter.com/QOUGWXrC3d
— Narendra Modi (@narendramodi) September 22, 2025
Also Read: కార్గో షిప్‌లో భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన వందల టన్నుల బియ్యం
స్వదేశీ తయారీ ఉత్పత్తులనే అమ్మాలని దుకాణదారులను నేను కోరుతున్నాయి. అలాగే ప్రజలు కూడా స్వదేశీ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. పరిశ్రమలు, పెట్టుబడులకు రాష్ట్రాలు కూడా అనుకూల వాతావరణం కల్పించాలని'' ప్రధాని మోదీ లేఖలో రాసుకొచ్చారు. ఇదిలాఉండగా ఆదివారం కూడా ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగం చేసిన సంగతి తెలిసిందే. జీఎస్టీ సంస్కరణలు పేద, మధ్యతరగతి వారికి ప్రయోజనం చేకూరుస్తాయంటూ చెప్పుకొచ్చారు.
My address to the nation. https://t.co/OmgbHSmhsi
— Narendra Modi (@narendramodi) September 21, 2025
Also Read: తండ్రి వర్ధంతి కోసం భారత్ వచ్చిన టెక్కి.. తిరిగి అమెరికా వెళ్లేందుకు రూ.7 లక్షల ఖర్చు